ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ.. భారత సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదన్న రాజ్‌నాథ్‌ సింగ్‌

"ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నాం. ఈ ఆపరేషన్ మొత్తం 22 నిమిషాల్లో ముగిసింది" అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ.. భారత సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదన్న రాజ్‌నాథ్‌ సింగ్‌

Updated On : July 28, 2025 / 3:04 PM IST

భారత సైనికుల సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. లోక్‌సభలో ఇవాళ ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్ర శిబిరాలపై మన దేశ సైనికులు దాడులు చేశారని అన్నారు. పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందని తెలిపారు.

“ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు పార్లమెంట్ సిద్ధంగా ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు పార్లమెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మే 6, 7 తేదీల్లో భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. ఇది కేవలం సైనిక ఆపరేషన్ మాత్రమే కాదు.. ఉగ్రవాదంపై భారత విధానాన్ని ఇది చూపించింది. ఇది భారత సార్వభౌమత్వం, భారత స్వరూపాన్ని, దేశ పౌరుల పట్ల ఉన్న బాధ్యతను ప్రతిబింబించింది” అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

Also Read: బెల్లం మిరపకాయతో భలే ఆరోగ్యం.. రోజూ తింటే రోగాలు మాయం.. గుండే, కళ్ళు సేఫ్

ఆపరేషన్ సిందూర్ చేపట్టే ముందు భారత సాయుధ దళాలు “సమగ్ర అధ్యయనం” చేశాయని సింగ్ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులకు వీలైనంత నష్టం కలిగిస్తూ పాకిస్థానీ పౌరులకు నష్టం తలెత్తకుండా చూసుకున్నామని వివరించారు. “ఆపరేషన్ సిందూర్ ప్రారంభించే ముందు ప్రతి అంశాన్ని మన సాయుధ దళాలు సమగ్రంగా అధ్యయనం చేశాయి.

పహల్గాం దాడి అనంతరం మన సాయుధ దళాలు చర్యలు చేపట్టి, 9 ఉగ్రవాద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన రీతిలో దాడి చేశాయి. ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నాం. వీరిలో ఎక్కువ మంది జైష్ ఎ మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్‌బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నవారు ఉన్నారు. ఈ ఆపరేషన్ మొత్తం 22 నిమిషాల్లో ముగిసింది” అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.