ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాలు సహా 15 రాష్ట్రాల్లో పోలింగ్
15 రాష్ట్రాల్లో ఏప్రిల్ 2, 3 తేదీల నాటికి ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

Rajya Sabha Election 2024 Schedule Released by Central Election Commission
Rajya sabha election 2024 : 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ 2, 3 తేదీల నాటికి ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 15 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాల లెక్కింపు ఉండడనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో మూడు చొప్పున రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి
ముఖ్యమైన తేదీలు ఇవే..
ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల
నామినేషన్ల దాఖలుకు ఆఖరుతేది ఫిబ్రవరి 15
ఫిబ్రవరి 16 నామినేషన్ల పరిశీలన
నమినేషన్ల ఉపసంహరణకి ఫిబ్రవరి 20 గడువు
ఫిబ్రవరి 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
అదే రోజు సాయంత్ర 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు.