రాజ్యసభ ఎన్నికలు వాయిదా

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ను వాయిదా వేసింది.
నామినేషన్లు ఉపసంహరణ తేదీ ముగిసేనాటికి 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్ధానాలు ఏకగ్రీవమయ్యాయి. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి కారణంగా మిగిలిన 18 స్ధానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. మళ్లీ కొత్త పోలింగ్ తేదీ, లెక్కింపు తేదీలను వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో సిక్కిం, మిజోరం మినహా దేశం మొత్తంలాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నాయి. 548 జిల్లాల్లపూర్తి స్ధాయి లాక్ డౌన్ అమలువుతోంది. యూపీ, మధ్యప్రదేశ్,ఒడిషా,రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్ లలో కొన్ని జిల్లాల్లో పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేస్తుండగా మిగతా రాష్ట్రాల్లో పూర్తి స్ధాయిలో లాక్ డౌన్ అమలువుతోంది.
See Also | కరోనా : కేసీఆర్ అత్యవసర మీటింగ్ : సర్వత్రా ఉత్కంఠ