సభలో ఫోన్స్ వాడొద్దన్న వెంకన్న నాయుడు

సభలో ఫోన్స్ వాడొద్దన్న వెంకన్న నాయుడు

Updated On : February 3, 2021 / 12:31 PM IST

Rajya Sabha Members Phone Recording : పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సభ్యులకు కీలక సూచనలు చేశారు. రాజ్యసభలో మొబైల్స్ ఫోన్స్ వాడరాదంటూ..ఆదేశించారు. సభ జరుగుతున్న సమయంలో..కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడడమే కాకుండా..సభా కార్యకలాపాలను కూడీ వీడియో తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం కరెక్టు కాదన్నారు. ఉన్నత రాజ్యసభ ఛాంబర్లో కూర్చొని సభ్యులు ఇలా వీడియోలు తీయడం పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధమని వెల్లడించారు. అందువల్ల ఇక నుంచి ఎవరూ కూడా ఛాంబర్లలో, సభా ప్రాంగణంలో మొబైల్స్ అస్సలు వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని ఆఫ్ పార్టీ ఎంపీలు సంజయ్ సింగ్, భగవత్ మన్ లు మొబైల్స్ ఉపయోగించి వీడియోలు తీశారు. మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళి అర్పిస్తున్న గందరగోళం చెలరేగింది. రైతు నిరసనలపై రాజ్యసభ 2021, ఫిబ్రవరి 03వ తేదీ బుధవారం 15 గంటల పాటు చర్చించనుంది. ఐదు గంటల పాటు చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా..ఏకంగా 15 గంటల పాటు చర్చిద్దామని ప్రభుత్వం వెల్లడించింది.