గుడ్ న్యూస్ : గడువు పెంచిన ఆర్బీఐ

మొబైల్ వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. మొబైల్ వ్యాలెట్లకు కేవైసీ గడువుని ఆర్బీఐ పెంచింది. ఆరు నెలలు పొడిగించింది. కేవైసీ

  • Published By: veegamteam ,Published On : September 3, 2019 / 03:47 AM IST
గుడ్ న్యూస్ : గడువు పెంచిన ఆర్బీఐ

Updated On : September 3, 2019 / 3:47 AM IST

మొబైల్ వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. మొబైల్ వ్యాలెట్లకు కేవైసీ గడువుని ఆర్బీఐ పెంచింది. ఆరు నెలలు పొడిగించింది. కేవైసీ

మొబైల్ వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. మొబైల్ వ్యాలెట్లకు కేవైసీ గడువుని ఆర్బీఐ పెంచింది. ఆరు నెలలు పొడిగించింది. కేవైసీ చేయించుకోవడానికి 2020 ఫిబ్రవరి 29వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు అందరూ మొబైల్ యూజర్లు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి మొబైల్ వ్యాలెట్స్ వాడుతున్నారు. వీటి ద్వారానే చాలావరకు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అనేక రకాల పేమెంట్స్ క్షణాల్లో అయిపోతున్నాయి. వీటికి కేవైసీ చేయించుకోవాలని ఆర్బీఐ చెప్పింది. దాని కోసం గతంలో ఆగస్ట్ 31 డెడ్ లైన్ పెట్టింది. ఆలోగా కేవైసీ చేయకపోతే సెప్టెంబర్ 1 నుంచి మొబైల్ వ్యాలెట్స్ పనిచేయవు అని చెప్పింది.

తాజాగా గడువు తేదీని ఆర్బీఐ పొడిగించింది. దీంతో మొబైల్ వ్యాలెట్ కంపెనీలు కూడా ఊపిరిపీల్చుకున్నాయి. తాజా ఉత్తర్వులతో ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర వ్యాలెట్స్ వాడేవారు ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్లు చేసుకోవచ్చు. అయితే కేవైసీ చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని చెప్పింది. ఫిబ్రవరి 29 తర్వాత గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.