ప్రస్తుతం చైనాతో భారత్ సంబంధాలు సరిగ్గా లేవు.. ఎందుకంటే?: విదేశాంగ మంత్రి జైశంకర్

S Jaishankar: పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని ప్రతి దేశం కోరుకుంటుందని చెప్పారు.

ప్రస్తుతం చైనాతో భారత్ సంబంధాలు సరిగ్గా లేవు.. ఎందుకంటే?: విదేశాంగ మంత్రి జైశంకర్

Foreign Minister Jaishankar

Updated On : May 12, 2024 / 9:10 PM IST

తూర్పు లద్దాఖ్‌లో ఐదేళ్ల క్రితం భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగి ఐదేళ్లు అవుతున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దీనిపై స్పందించారు.

ప్రస్తుతం చైనాతో భారత్ సంబంధాలు సరిగ్గా లేవని, ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగిందని జైశంకర్ తెలిపారు. అందుకే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని చైనా గ్రహించాలని, సొంత ప్రయోజనాలను గుర్తించడం కాదని ప్రధాని మోదీ అన్నారని చెప్పారు.

చైనాతో మిగిలిపోయిన సమస్యల పరిష్కారంపై భారత్ ఆశాభావంతో ఉందని జైశంకర్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించడంపైరనే సరిహద్దులో శాంతి, ప్రశాంతత ఆధారపడి ఉంటాయని అన్నారు. మిగిలిపోయిన సమస్యలు ప్రధానంగా పెట్రోలింగ్ హక్కులు, పెట్రోలింగ్ సామర్ధ్యాలకు సంబంధించినవని చెప్పారు.

చైనాతో సమస్యల పరిష్కారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పూర్తి స్థాయిలో అభిప్రాయాన్ని తెలిపారని జైశంకర్ అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని ప్రతి దేశం కోరుకుంటుందని చెప్పారు.

Hyderabad Rain Alert : తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ!