రైతు ఖాతాల్లోకేనా! : మోడీ సర్కార్ కు రూ.28వేల కోట్ల చెక్కు

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2019 / 02:06 PM IST
రైతు ఖాతాల్లోకేనా! : మోడీ సర్కార్ కు రూ.28వేల కోట్ల చెక్కు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెంట్ ను కేంద్రప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ కు వరుసగా ఆర్బీఐ అడ్వాన్స్ పేమంట్ ఇవ్వడం వరుసగా ఇది రెండోసారి. టర్కీ ప్రెసిడెంట్ ఈర్డోజన్ పాలనకి రెఫరెండంగా భావిస్తున్న మార్చిలో జరిగే మున్పిపల్ ఎన్నికలకు ముందు ఆ దేశ సెంట్రల్ బ్యాంకు ప్రభుత్వానికి సాయమందించిన విధానాన్ని ఆర్బీఐ కూడా ఫాలో అయి మోడీ సర్కార్ కు ఎన్నికల ముందు 28 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది.

మే నెలలో జనరల్ ఎలక్షన్స్ జరుగనున్న సమయంలో ఆర్బీఐ ఇచ్చే డివిడెంట్ ఫండ్ మోడీ సర్కార్ కి బాగా కలిసివస్తుంది.ద్రవ్యలోటును పూడ్చడానికి, రైతులకు నేరుగా నగదు వంటి స్కీమ్ లకు ఆర్‌బీఐ నిధులు అత్యంత కీలకంగా మారాయి  మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో నేరుగా  ఆరు వేలు వేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మోడీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ తొలి విడత చెల్లింపులకు దాదాపు రూ.20వేల కోట్ల వరకు ప్రభుత్వానికి అవసరం.