దాణా కుంభకోణం కేసు : లాలూకు షాకిచ్చిన సుప్రీం

దేశంలో సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసుల్లో రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ (ఆర్జేడీ) లాలూ యాదవ్ కు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

  • Published By: sreehari ,Published On : April 10, 2019 / 06:52 AM IST
దాణా కుంభకోణం కేసు : లాలూకు షాకిచ్చిన సుప్రీం

Updated On : April 10, 2019 / 6:52 AM IST

దేశంలో సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసుల్లో రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ (ఆర్జేడీ) లాలూ యాదవ్ కు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

దేశంలో సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసుల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)  చీఫ్ లాలూ యాదవ్ కు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ యాదవ్.. తన వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేవేసింది. లాలూకు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. లూలూకు బెయిల్ ఇస్తే.. ఆస్పత్రి నుంచే రాజకీయం చేస్తున్నారని సీబీఐ కోర్టుకు విన్నవించింది.

బీహార్ నేత న్యాయవాది కపిల్ సిబాల్.. లాలూ తరపున వాదిస్తూ.. కోర్టు 14ఏళ్లు మాత్రమే జైలు శిక్ష విధించిందని, 25ఏళ్లు కాదని, ఆయన ఎక్కడికి పారిపోరంటూ వినిపించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్.. సిబాల్ వాదనను తోసిపుచ్చారు. లాలూకు 25ఏళ్లు లేదా 14ఏళ్ల జైలు శిక్ష విధించాలనేది హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజకీయ నాయకులపై నమోదైన కేసులను వేగవంతంగా విచారించాల్సిందిగా హైకోర్టుకు సూచిస్తామన్నారు. 
Read Also : 8 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో లూసిఫర్

లాలూకు విధించిన 14ఏళ్ల శిక్షాకాలంలో 24నెలలు మాత్రమే శిక్ష అనుభవించారని కోర్టు గుర్తు చేసింది. ఈ సందర్భంగా లాలూకు బెయిల్ మంజూరు చేస్తే ప్రమాదామా? అని సిబల్ కోర్టులో వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీం.. బెయిల్ ఇవ్వడంలో ప్రమాదం ఏమి లేదు. ఆయన దోషిగా తేలిన ఖైదీ తప్ప. అందుకే లాలూ బెయిల్ నిరాకరిస్తూ పిటిషన్ కొట్టివేశామన్నారు.

లాలూకు బెయిల్ ఇస్తే.. ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సీబీఐ ఆరోపిస్తోంది. 1990 దాణా కుంభకోణం కేసుతోపాటు లాలూ మూడు కేసుల్లో దోషిగా ఉన్నారు. డిసెంబర్ 2017లో లాలూతో పాటు మరో 15మందిని దోషిలుగా న్యాయస్థానం తేల్చింది. మార్చి 2018లో సీబీఐ స్పెషల్ కోర్టు.. మనీలాండరింగ్ కేసులో లాలూకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.   
Read Also : ఉగ్రవాదాన్ని ఉరికించి కొడతాం…JKLF చీఫ్ అరెస్ట్