150 మంది ప్రాణాలు తీసింది : యుమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళితే యమపురికే

ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వే ప్రయాణికుల పాలిట యమగండంగా మారింది. ఈ సంవత్సరం జూలై 31వ తేదీ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 150 మందికి పైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి.
వివరాలు.. ఢిల్లీ, ఆగ్రాలను కలిపే 165 కిలోమీటర్ల పొడువైన రహదారిలో ఈ సంవత్సరం జూలై 31వ తేదీ వరకు మొత్తం 357 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 822 మంది వరకు గాయపడగా… 145మందికి పైగా ప్రయాణికులు మరణించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్(RTI) చట్టం అందించిన సమాచారం ప్రకారం ఆగ్రాకు చెందిన లాయర్ కృష్ణ చంద్ వేసిన RTI పిటిషన్ ద్వారా ఈ డేటా వెలుగులోకి వచ్చింది.
డేటా ప్రకారం బయటపడిన ప్రమాదాలు, మరణాలు..
> 2012లో 280 ప్రమాదాలు, 33 మరణాలు.
> 2013లో 896 ప్రమాదాలు, 118 మరణాలు, 1345 మందికి గాయాలు.
> 2014లో 771 ప్రమాదాలు, 127 మరణాలు, 1335 మందికి గాయాలు.
> 2015లో 919 ప్రమాదాలు, 142 మరణాలు, 1392 మందికి గాయాలు.
> 2016లో 1219 ప్రమాదాలు, 133 మరణాలు, 1524 మందికి గాయాలు.
> 2017లో 763 ప్రమాదాలు, 146 మరణాలు, 1426 మందికి గాయాలు.
> 2018లో 659 రోడ్డు ప్రమాదాలు, 111 మరణాలు, 1388 మందికి గాయాలు.
> 2019లో 357 ప్రమాదాలు, 150 మరణాలు, 822 మందికి గాయాలు.
దీంతో హైవే పై పెరుగుతున్న ప్రమాదాలు, మరణాలను నియంత్రించడానికి చర్యలు తీసుకున్నామని, అధిక వేగంతో లేదా టైర్ బస్టింగ్ కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అతారిటీ (YEIDA) తెలిపింది.