బిగ్ బ్రేకింగ్ : రాబర్ట్ వాద్రా పొలిటికల్ ఎంట్రీ : నా అనుభవాలు దేశం కోసం

ఢిల్లీ : రాబర్ట్ వాద్రా..కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ.. ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌వాద్రా పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తిని కనబరుస్తున్నట్లుగా సూచాయిగా వెల్లడించారు. తన అనుభవంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని..ఇవన్నీ సద్వినియోగం కావాలంటే ప్రజాసేవ చేయాలన్న ఆలోచన తనకు ఉందని తాజాగా రాబర్ట్ వాద్రా బైటపెట్టారు.
రాజకీయాల్లోకి రానున్నట్లు డైరెక్ట్ గా చెప్పకపోయినా..తన రాజకీయ ఆసక్తిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. మనీలాండరింగ్, భూ ఆక్రమణ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాద్రా ఇటీవలే ఈడీ ఎదుట పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ‘ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న అపవాదులు, ఆరోపణలకు తెరపడగానే ప్రజాసేవకు అంకితం అయ్యేలా పెద్ద పాత్ర పోషించాలని ఉంది’ అంటూ తెలిపారు.
యూపీ ప్రచారంలో పనిచేశానని..అప్పుడు ప్రజలు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలను మర్చిపోలేనని తెలిపారు. రాబర్ట్‌వాద్రా సతీమణి ప్రియాంకా గాంధీని ఇటీవలే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఉత్తరప్రదేశ్ బాధ్యతలను ఆమెకు రాహుల్‌గాంధీ అప్పగించారు. ఇప్పుడు బావ కూడా రాజకీయాల్లో రావాలని ఆసక్తి చూపుతుండడంతో రాహుల్ గాంధీ ఆయనకు మరే బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.