దేవాలయంలో నీళ్లు తాగాడని దారుణంగా దెబ్బలు తిన్న బాలుడికి రూ.10లక్షల సాయం

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ దేవాయలంలో నీళ్లు తాగిన ఓ బాలుడిని దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. దేవాలయంలోకి వచ్చి నీళ్లు తాగాడని ఆ బాలుడికి ఇప్పుడు రూ. 10 లక్షల విరాళాలు పోగయ్యాయి. స్వచ్ఛంద సంస్థ కెటో బాధిత బాలుని కోసం ఆన్‌లైన్ లో నిధులు సేకరించేందుకు విరాళాలు కోరింది.

దేవాలయంలో నీళ్లు తాగాడని దారుణంగా దెబ్బలు తిన్న బాలుడికి రూ.10లక్షల సాయం

Rs. 10 Lakh Were For The Boy Beaten For Drinking Water In Temple

Updated On : March 20, 2021 / 4:39 PM IST

Rs. 10 lakh were for the boy beaten for drinking water in temple : ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ దేవాయలంలో నీళ్లు తాగిన ఓ బాలుడిని దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. దేవాలయంలోకి వచ్చి నీళ్లు తాగాడని ఆ బాలుడికి ఇప్పుడు రూ. 10 లక్షల విరాళాలు పోగయ్యాయి. స్వచ్ఛంద సంస్థ కెటో బాధిత బాలుని కోసం ఆన్‌లైన్ లో నిధులు సేకరించేందుకు విరాళాలు కోరింది.

సదరు బాదిత బాలుడికి గురించి తెలిసిన పలువురు దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. అలా ఆ బాలుడికి ఇప్పటివరకూ రూ 10 లక్షల విరాళాలు అందాయి. బాధిత బాలుడు చదువు కోవటానికి..వారి కుటుంబం ఆర్థికంగా ఆదుకోవటానికి విరాళాలు అందించాల్సిందిగా కెటో సంస్థ కోరగా…భారీగా నిధులు అందాయి..ఇంకా అందుతూనే ఉన్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో మొత్తం 648 మంది దాతలు ఈ విరాళాలను అందించటం గమనించాల్సిన విషయం.

దాహంగా ఉన్న బాలుడు మంచినీళ్లు తాగటానికి యూపీలోని ఘజియాబాద్‌లో గల డస్నా దేవి మందిరం వద్దకు వచ్చాడు. కానీ మతోన్మాదం గల శృంగీ నందన్ యాదవ్ అనే వ్యక్తి మంచినీళ్లు తాగుతున్న బాలుడి వద్దకొచ్చి ‘‘నీ పేరు ఏమిటి?’’ అని అడిగాడు. దానికి ఆ బాలుడు ‘‘నా పేరు అసిఫ్’’ అని చెప్పాడు. ఈ మాట విన్నవెంటనే యాదవ్ ఆ బాలుడిని చేతులు వెనక్కి విరిచి పట్టుకుని కొడతాడు. కిందపడవేసి చితక బాదాడు. ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలోకి వస్తావా? ఇక్కడి నీళ్లు తాగి కలుషితం చేస్తావా? అంటూ చితకబాదాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది.