Richest Indian Village: ప్రపంచంలో ధనిక గ్రామం భారత్‌లోనే.. ఈ ఊరిలో బ్యాంకుల్లో రూ.5వేల కోట్లు

గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామాల్లో సంపద పెరిగితే, దేశ సంపద పెరుగుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాలే, దేశ అభివృద్ధిలో కీలకం.

Richest Indian Village: ప్రపంచంలో ధనిక గ్రామం భారత్‌లోనే.. ఈ ఊరిలో బ్యాంకుల్లో రూ.5వేల కోట్లు

Madhapar

Updated On : August 11, 2021 / 9:22 AM IST

Richest Indian Village: గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామాల్లో సంపద పెరిగితే, దేశ సంపద పెరుగుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాలే, దేశ అభివృద్ధిలో కీలకం. అటువంటి గ్రామాల్లో ఒకటి మన దేశంలోనే ఉంది. అవును ప్రపంచంలోనే సంపన్న గ్రామంగా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఓ గ్రామం నిలిచింది. కచ్ జిల్లాలో మాదపర్ అనే గ్రామం ప్రపంచంలోనే సంపన్న గ్రామంగా నిలిచింది.

ఈ గ్రామంలోని నివాసితులు సంపన్నులుగా కీర్తి గడించారు. గ్రామంలో 17కి పైగా బ్యాంకులు ఉండగా.. దాదాపు 7,600 గృహలు ఉన్నాయి. గ్రామంలోని ప్రజలు ఈ బ్యాంకులలో 5వేల కోట్ల రూపాయల డిపాజిట్ ఉంది. మిస్ట్రీస్ క‌మ్యూనిటీ ప్ర‌జ‌లు ఎక్కువగా ఉండే క‌చ్ జిల్లాలోని 18 గ్రామాల్లో మాదప్ ఒకటి.

ఆ ఊరును ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక గ్రామం అని పిలవడానికి వారి బ్యాంక్ బ్యాలెన్స్ కారణమైతే, ఆ ఊరిలోని ప్రజలంతా వివిధ ప్రాంతాల్లో కోట్లు అర్జిస్తున్నారు. అమెరికా, కెనడా, యూకేతో సహా పలు ప్రాంతాల్లో ఉన్న ఈ ఊరివాళ్లు బాగా సంపాదిస్తూ ఊరిలోని కుటుంబ సభ్యులకు పంపుతున్నారంట. ఈ ఊరిలో ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు, చెరువులు, పార్కులు, డ్యామ్‌లు, హెల్త్ సెంట‌ర్లు, దేవాలయాలు, పెద్ద గోశాల కూడా ఉంది.

అంచనాల ప్రకారం, గ్రామంలో సగటు తలసరి డిపాజిట్ దాదాపు 15 లక్షలు. ఎక్కువగా పటేళ్లు ఉండే ఈ గ్రామంలో 65 శాతానికి పైగా ప్రజలు ఎన్నారైలు, వారు విదేశాల నుంచి తమ కుటుంబాలకు భారీ మొత్తంలో డబ్బును పంపుతుంటారు ఈ ఎన్నారైలలో చాలామంది, సంపద సంపాదించిన తర్వాత, గ్రామాలకు తిరిగి వస్తుంటారు. నివేదికల ప్రకారం, మాదాపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థ 1968లో లండన్‌లో స్థాపించబడింది. ఇది విదేశాలలో నివసిస్తున్న మాదాపర్ ప్రజల మధ్య సమావేశాలను సులభతరం చేస్తుంది. ప్రజల మధ్య మృదువైన కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి గ్రామంలో కూడా ఇదే విధమైన కార్యాలయం ప్రారంభించారు.

విదేశాలకు వెళ్లినవారు ఊరిలోని యువతకు చేయూత అందించి, వారిని ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేస్తుంటారు. చాలా మంది గ్రామీణులు విదేశాలలో స్థిరపడినప్పటికీ, ఊరి మట్టిలో లోతుగా పాతుకుపోయిన తమ మూలాలను మాత్రం మర్చిపోవట్లేదు. వారు తమ డబ్బును వారు నివసించే దేశం కంటే గ్రామంలోని బ్యాంకులలో ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయమే ఇక్కడ ప్రధాన వృత్తి, ఊరిలో తయారయ్యే ఉత్పత్తులను ముంబైలో మార్కెటింగ్ చేస్తుంటారు గ్రామస్తులు. ముఖ్యంగా ఈ ఊరిలో సోమరిగా తిరిగేవాళ్లు లేకపోవడం విశేషం.