Priyanka Gandhi: ఆర్ఎస్ఎస్, బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు – ప్రియాంక గాంధీ
రాహుల్ గాంధీ చేసిన హిందూత్వ వాది కామెంట్లకు సపోర్టు చేస్తూ.. కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ ఆర్ఎస్ఎస్, బీజేపీలపై విమర్శలకు దిగారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

Priyanka Gandhi
Priyanka Gandhi: రాహుల్ గాంధీ చేసిన హిందూత్వ వాది కామెంట్లకు సపోర్టు చేస్తూ.. కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ ఆర్ఎస్ఎస్, బీజేపీలపై విమర్శలకు దిగారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
హిందూయిజం నిజాయతీ, అందరిపై ప్రేమ చూపిస్తుందని కాంగ్రెస్ లీడర్ అన్నారు. కానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నిజాయతీని పక్కకుబపెట్టి కరెక్ట్ దారిని విస్మరిస్తున్నాయని అన్నారు. ‘ఆర్ఎస్ఎస్, బీజేపీ సభ్యులు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. వాళ్లు నిజాయతీ ఉన్న కరెక్ట్ దారిలో లేరు. రాహుల్ గాంధీ ఆ తేడానే చూపిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ శనివారం బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. హిందూత్వవాదులు దేశంలో బాధ, విచారానికి కారణమని అన్నారు. ఈ రోజు మన దేశంలో ఇవి ఉన్నాయంటే దానికి కారణం హిందూత్వవాదుల వల్లనే. హిందువులు సత్యాగ్రహాన్ని నమ్మితే.. హిందూత్వవాదులు రాజకీయ దురాశతో ప్రవర్తిస్తున్నారు’ అని ప్రసంగించారు.
……………………… : కొడుకు ఆత్మహత్యని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇన్ ఛార్జిగా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీల ఫోన్లను బీజేపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందంటూ ఆరోపణలు గుప్పించారు.
‘ప్రభుత్వం పనిఏంటి? సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడం, అభివృద్ధి కనబరచడం. అది పక్కకుబెట్టి ప్రభుత్వం ప్రతిపక్షం ఫోన్లను ట్యాప్ చేస్తుంది’ అని కామెంట్ చేశారు.
………………………: కోహ్లీ యాటిట్యూడ్ అంటే ఇష్టం కానీ అది కష్టం – గంగూలీ