Karnataka Minister : ఆర్ఎస్ఎస్ లేకుంటే భారత్ మరో పాకిస్తాన్ అయ్యేది
దేశంలో నాలుగు వేల మంది సివిల్ సర్వెంట్స్ కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) శిక్షణ ఇచ్చిందని.. ఇప్పుడు వాళ్లే బ్యూరోక్రసీలో ఉండి అన్ని ప్రభుత్వ సంస్థల్ని నియంత్రిస్తున్నారని

Karnataka (1)
Karnataka Minister దేశంలో నాలుగు వేల మంది సివిల్ సర్వెంట్స్ కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) శిక్షణ ఇచ్చిందని.. ఇప్పుడు వాళ్లే బ్యూరోక్రసీలో ఉండి అన్ని ప్రభుత్వ సంస్థల్ని నియంత్రిస్తున్నారని, దేశం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుని పాలిస్తున్నారంటూ కర్ణాటక మాజీ సీఎం,జేడీయూ నేత కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక పశు సంక్షేమ శాఖ మంత్రి ప్రభు చౌహాన్ మండిపడ్డారు. అసలు ఆర్ఎస్ఎస్ లేకుంటే దేశం ఈపాటికి మరో పాకిస్తాన్‌లా తయారయ్యేదని మంత్రి ప్రభు చౌహాన్ బుధవారం అన్నారు.
ఆర్ఎస్ఎస్ అనే దేశభక్తి కలిగిన సంస్థ..అది దేశాన్ని రక్షణకవచంలా కాపాడుతోంది. ఆర్ఎస్ఎస్ రక్షణలో భారత్ సేఫ్ గా ఉంది. భారత ప్రజలు ఏ దేశానికి లేదా శక్తులకు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. కుమారస్వామి,జేడీఎస్ పార్టీకి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేందుకు ఎలాంటి విశ్వసనీయత లేదని మంత్రి అన్నారు.
ఇక,ఇటీవల బెంగళూరులోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ నేతలను తాలిబన్లతో పోల్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి దేశంలో పాలనాయంత్రాన్ని నడిపిస్తోంది ఆర్ఎస్ఎస్ అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.
ALSO READ హస్తిన పర్యటనలో బిగ్ బుల్..నిన్న మోదీ,నేడు నిర్మలమ్మతో భేటీ..అందరిలో ఆసక్తి