Russia President Putin : నేడు భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్.. ప్రధానితో భేటీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత పర్యటనకు రానున్నారు. చిరకాల మిత్రదేశం రష్యా.. భారత్ మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి.

Russia President Putin
Russia President Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత పర్యటనకు రానున్నారు. చిరకాల మిత్రదేశం రష్యా.. భారత్ మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా భేటీ జరుగనుంది. మోదీ-పుతిన్‌లు సోమవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సమావేశం కానున్నారు.
చదవండి : Putin To Visit India : డిసెంబర్-6న భారత్ కు పుతిన్
ఈ సమావేశంలో ఉభయ దేశాల మధ్య 10 కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రక్షణ, పర్యావరణ మార్పులు, వాణిజ్యం సహా ఇతర రంగాలకు చెందిన 10 ఒప్పందాలపై సంతకాలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే భారత్ ఎంతగానో ఎదురు చూస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను మరింత వేగంగా అందించాలని భారత్ రష్యాను కోరే అవకాశం ఉంది.
చదవండి : Modi-Putin : అప్ఘాన్ పరిస్థితులపై 45 నిమిషాలు ఫోన్ లో మాట్లాడుకున్న మోదీ-పుతిన్
రష్యా అధ్యక్షుడి షెడ్యూల్ ఇలా..
10:30AM: ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం మరియు చర్చలు.
10.30AM: ఇద్దరు రక్షణ మంత్రుల మధ్య సమావేశం మరియు చర్చలు
11.30AM: భారతదేశం-రష్యా మధ్య మొదటి 2+2 సంభాషణ, దీనిలో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల ప్రతినిధి బృందం చర్చలు.
3-4 PM: వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక విమానం ఢిల్లీ చేరుకుంటుంది.
సాయంత్రం 5: హైదరాబాద్ హౌస్‌లో మోదీ-పుతిన్ భేటీ
5:30 PM: మోదీ-పుతిన్ చర్చలు ప్రారంభం
7.30PM: డిన్నర్
8-9PM ఉమ్మడి ప్రకటన విడుదల
9.30PM – పుతిన్ రష్యాకు బయలుదేరుతారు
అయితే దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు పుతిన్ అక్కడే ఉంటారు.
చదవండి : Russia – PUTIN: ఇదే శాసనం.. 2036 వరకూ రష్యా అధ్యక్షుడు పుతిన్