పబ్లిసిటీ కోసం వాడేస్తున్నారు : మోడీ ఫొటోలతో చీరలు

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 02:41 PM IST
పబ్లిసిటీ కోసం వాడేస్తున్నారు : మోడీ ఫొటోలతో చీరలు

Updated On : March 31, 2019 / 2:41 PM IST

ప్రధాని మోడీ ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ఇటీవల రైళ్ళలో టీ కప్పులపై కూడా మైబీ చౌకీదార్ అనే నినాదంతో బీజేపీ ప్రచారానికి తెరలేపింది. ఇంకొందరు బీజేపీ అభిమానులు పెళ్లి  శుభలేఖలను కూడా ప్రచారాస్త్రంగా వాడారు. ‘మాపెళ్లికి మీరు గిఫ్టులు ఇవ్వొద్దు కానీ మోడీ కి ఓటేయ్యండని’ కోరిన సంఘటన కూడా మనం చూశాం. మహిళా ఓటర్లను ఆకర్షించటానికి బొట్టు బిళ్లల ప్యాకెట్ పై ఏకంగా మోడీ బొమ్మను ముద్రించారు. ప్రస్తుతం మోడీ చిత్రంతో రూపుదిద్దుకున్న చీరలు మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

మన్‌కీ బాత్, మోడీ విజన్, సర్జికల్ స్ట్రైక్స్‌, ఎయిర్ స్ట్రైక్.. ఇలా వివిధ రకాల పేర్లతో తయారైన చీరలు మహిళల అట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఈ సరికొత్త చీరలను కట్టుకుని మగువలు మురిసిపోతున్నారు. దీనిపై వ్యాపారుల కూడా హర్షం చేస్తున్నారు. దేశంలో మోడీ మానియా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమంటున్నారు.