CJI NV Ramana: రేప్ నిందితుడికి ఘనస్వాగతం.. సీజేఐ తీవ్ర ఆగ్రహం!

క్రూరమైన నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించి తిరిగి బయటకి వచ్చే సందర్భం.. లేదంటే ఆ నిందితుడు బెయిల్ పై విడుదలైన..

CJI NV Ramana: రేప్ నిందితుడికి ఘనస్వాగతం.. సీజేఐ తీవ్ర ఆగ్రహం!

Cji Nv Ramana

Updated On : April 13, 2022 / 6:40 AM IST

CJI NV Ramana: క్రూరమైన నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించి తిరిగి బయటకి వచ్చే సందర్భం.. లేదంటే ఆ నిందితుడు బెయిల్ పై విడుదలైన సందర్భాలలో ఆ నేరస్థులకు కూడా సమాజంలో ఘనస్వాగతాలు లభించడం ఇప్పుడు మేధావులను ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా వివిధ నేరాలలో జైలు జీవితం గడిపి తిరిగి మళ్ళీ సమాజంలోకి వచ్చే ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతల విషయంలో ఇలాంటి సందర్భాలు కనిపిస్తుంటాయి.

CJI NV Ramana : సీబీఐపై సీజేఐ ఎన్‌ వి.రమణ కీలక వ్యాఖ్యలు

అయితే, మధ్యప్రదేశ్ లో ఓ విద్యార్థి సంఘం నాయకుడి విషయంలో కూడా అదే జరిగింది. ఏబీవీపీ విద్యార్థి నాయకుడు శుభాంగ్ గొంటియా ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని.. పలుమార్లు అత్యాచారం చేసి తనను గర్భవతిని చేశాడని ఓ యువతి కోర్టు కెక్కింది. ఈ కేసులో శుభాంగ్ కొన్నాళ్లు ఆచూకీ లేకుండా పోగా.. గత ఏడాది ప్రభుత్వం ఆచూకీ చెప్పిన వారికి నజరానా కూడా ప్రకటించింది. మొత్తంగా గత ఏడాది శుభాంగ్ కు పోలీసులు అరెస్ట్ చేశారు.

CJI NV Ramana : మీ ప్రేమాభిమానం ఎన్నటికీ మరువను – సీజేఐ ఎన్వీ రమణ

కాగా, అత్యాచారం కేసులో అరెస్టైన ఆ వ్యక్తికి గత ఏడాది నవంబర్ లోనే బెయిల్ కూడా దొరికింది. దీంతో ఆ సందర్భంలోనే అతని అభిమానులు, అనుచరులు సంబరాలు చేసుకున్నారు. భయ్యా ఈజ్ బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వేసి ఘనస్వాగతం పలికారు. దీంతో బాధితురాలు నిందితుడి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించగా.. కేసును విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

CJI NV Ramana: ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీజేఐ

అత్యాచార నిందితుడికి ఘనస్వాగతామా? నిందితుడికి బెయిల్ వస్తే సంబరాలు ఏంటి? అసలు అన్న తిరిగి రావడం ఏంటి? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ.. నిందితుడి బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీచేశారు. అంతేకాదు.. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించాలని కోరింది. చివరిగా ఒక్క వారం మీ అన్నని జాగ్రత్తగా ఉండమనండి అంటూ నిందితుడి తరపు లాయర్ కి సీజేఐ చురకలంటించారు.