CJI NV Ramana : సీబీఐపై సీజేఐ ఎన్‌ వి.రమణ కీలక వ్యాఖ్యలు

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనే మన స్వేచ్ఛ ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరూ చూడకూడదని, నేరాల నిరోధానికి పోలీసులు నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు.

CJI NV Ramana : సీబీఐపై సీజేఐ ఎన్‌ వి.రమణ కీలక వ్యాఖ్యలు

CJI NV Ramana : పోలీసు అధికారాలను రాజకీయ నేతలు దుర్వినియోగం చేయడం ఎప్పటినుంచో ఉందని ఎన్‌వి.రమణ అన్నారు. సీజేఐ సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్‌ డి.పి.కోహ్లీ 19వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రజాస్వామ్యం, దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు అంశంపై జస్టిస్‌ ఎన్‌వి. రమణ ప్రసంగించారు. అందరి విషయంలో చట్టం సమానంగా అమలు చేయడం పోలీసుల విధి అన్నారు.

బాధితులకు న్యాయం అందించడంలో చట్టం అమలు అంతర్భాగమన్నారు. భారతీయులందరం మన స్వేచ్ఛను మనం ప్రేమిస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనే మన స్వేచ్ఛ ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరూ చూడకూడదని, నేరాల నిరోధానికి పోలీసులు నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు.

CJI NV Ramana : తెలుగు రాష్ట్రాల నుంచి పద్మా పురస్కారాలు అందుకున్నవారిని సత్కరించిన సిజేఐ ఎన్ వి రమణ

ప్రస్తుతం సీబీఐ తన పని తాను చేసుకుపోతోందని సీజేఐ అన్నారు. పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడం, స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరమని ఎన్ వి.రమణ స్పష్టం చేశారు. ప్రతి దర్యాప్తు సంస్థ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని.. అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ ఉండాలన్నారు.

విశ్వసనీయతలో జాతీయ సంస్థల కంటే పోలీసులు వెనకబడుతున్నారని తెలిపారు. రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అత్యవసరమన్నారు. నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ దర్యాప్తు సంస్థలే శాశ్వతమని సీజేఐ పేర్కొన్నారు.