Operation Karregutta: 20వేల మందికిపైగా సాయుధ బలగాలు.. కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న జవాన్లు, బేస్ క్యాంప్ కోసం ఏర్పాట్లు..

కర్రెగుట్టని మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని భద్రత బలగాలు భావిస్తున్నాయి.

Operation Karregutta: 20వేల మందికిపైగా సాయుధ బలగాలు.. కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న జవాన్లు, బేస్ క్యాంప్ కోసం ఏర్పాట్లు..

Updated On : May 1, 2025 / 7:36 PM IST

Operation Karregutta: కర్రెగుట్టలను భద్రతా బలగాలు స్వాధీన పరుచుకున్నాయి. కర్రెగుట్టలో 20వేల మందికి పైగా సాయుధ బలగాలు ఉన్నాయి. అన్ని వైపుల నుంచి భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కర్రెగుట్టల్లో పైభాగంలో బేస్ క్యాంపు ఏర్పాటునకు రంగం సిద్ధం చేస్తున్నారు. 10వేల మందితో కూడిన బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు.

బేస్ క్యాంపు సమీపంలో భారీ సెల్ టవర్లను ఏర్పాటు చేశాయి సాయుధ బలగాలు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ వద్ద భారీగా భద్రత కల్పించారు. బేస్ క్యాంప్ వద్దకు డాగ్ స్క్వాడ్, మైన్ ప్రూఫ్ తో పాటు భారీగా ఆయుధాలను మోహరించారు. మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను బలగాలు గుర్తించాయి.

కర్రెగుట్టలోని దోబి కొండ, నీలం సారాయి కొండలను జవాన్లు స్వాధీన పరుచుకున్నారు. కర్రెగుట్టని మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని భద్రత బలగాలు భావిస్తున్నాయి. కర్రెగుట్ట అన్ని ప్రాంతాల నుంచి స్వాధీనానికి ఏర్పాట్లు చేశాయి బలగాలు.

Also Read: మోదీ సర్కార్ ఎవరినీ వదలదు, వెంటాడి వెంటాడి అంతం చేస్తుంది- అమిత్ షా

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో బీజాపూర్ జిల్లాలో ఉన్న కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరింది. మావోయిస్టు నేతలు లక్ష్యంగా భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. 9 రోజుల ఈ ఆపరేషన్‌లో భాగంగా కర్రెగుట్టలను భద్రతా బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. కర్రెగుట్టపై పూర్తి పట్టును సాధించాయి. 20వేలకు పైగా సాయుధ బలగాలు ఈ ఆపరేషన్​లో పాల్గొన్నాయి. 5 వేల అడుగుల ఎత్తులోని కర్రెగుట్టల్లో శిఖరం వరకు చేరుకున్న బలగాలు జాతీయ పతాకాన్ని ఎగురవేశాయి.

CRPF నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు పెద్ద సంఖ్యలో కూంబింగ్ లో పాల్గొన్నాయి. కర్రెగుట్టను భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేశాయి. దేశంలోని మావోయిస్టుల కార్యకలాపాలను నిర్మూలించడం లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. 2026 కల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ కర్రెగుట్టలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.