Seethakka: మణిపూర్‌లో చిన్న పిల్లలపై హత్యాచారాలు.. అవన్నీ ఇందుకే బయటకు రావట్లేదు: ఎమ్మెల్యే సీతక్క
ఇన్ని రోజులు ఏమీ తెలియదన్నట్లుగా మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు.

Seethakka
Seethakka – Manipur: మణిపూర్‌లో చిన్న పిల్లలపై కూడా హత్యాచారాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. అక్కడ జరిగే ఘటనలు బయటికి రావడం లేదని అన్నారు. ఆర్మీ, నెట్ వర్క్ అంతా బీజేపీ చేతుల్లోనే ఉందని ఆమె ఆరోపించారు. మణిపూర్‌లో హింసాకాండ గురించి 79 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడడం బాధాకరమని సీతక్క అన్నారు.
ఇన్ని రోజులు ఆయనకు ఏమీ తెలియదన్నట్లుగా చెబుతున్నారని సీతక్క విమర్శించారు. ప్రజలు మోదీపై ఆగ్రహంతో ఉన్నారని, దీంతో వారిని కాస్త శాంతపర్చడానికి ఆయన మణిపూర్ ఘటనపై స్పందించినట్లు ఉందని చెప్పారు. మణిపూర్ లో కుకీ తెగపై దాడులు, హత్యాచారాలు జరుగుతుండడం విచారకరమని అన్నారు.
మణిపూర్ వెళ్లాలనుకన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనను బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని సీతక్క చెప్పారు. బీజేపీ సర్కార్ వైఫల్యం వల్లే మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగా ఉన్న బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడి దారుణాలపై మాట్లాడడం లేదని అన్నారు.
ప్రతిపక్షాల కూటమి ఇండియా మణిపూర్ కోసం పనిచేస్తుందని సీతక్క చెప్పారు. మణిపూర్ ప్రజలకు మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మణిపూర్ విషయాన్ని వదిలి డబుల్ బెడ్రూమ్ లపై కిషన్ రెడ్డి మాట్లాడడం ఏంటని నిలదీశారు. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని చెప్పారు. కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసే అంత అవసరం లేదని, అయినా ఆ పనిచేశారని అన్నారు.
Manipur Violence: మణిపూర్‌లో ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదు?