Meerut : గొంతు కోసుకుని రక్తాన్ని అమ్మవారికి సమర్పణ!..తర్వాత

అమ్మవారికి నైవేద్యంగా గొంతు కోసం రక్తాన్ని సమర్పించింది. కానీ...తీవ్రగాయం కావడం...అనంతరం గుళ్లో ఉన్న గుడి గంటలకు ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపింది.

Meerut : గొంతు కోసుకుని రక్తాన్ని అమ్మవారికి సమర్పణ!..తర్వాత

Crime

Updated On : August 20, 2021 / 1:21 PM IST

Self Sacrifice : మూఢనమ్మకాలతో కొంతమంది పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలు అంటూ వేలాడుతున్నారు. భక్తి ముసుగులో దారుణాలకు తెగబడుతున్నారు. ఓ యువతి అమ్మవారికి నైవేద్యంగా గొంతు కోసం రక్తాన్ని సమర్పించింది. కానీ…తీవ్రగాయం కావడం…అనంతరం గుళ్లో ఉన్న గుడి గంటలకు ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Honey-Trapping Racket: రిటైర్డ్ ఐఏఎఫ్ అధికారిని బ్లాక్ మెయిల్.. హనీట్రాప్

ఖర్ కోడా పోలీస్ స్టేషన్ పరిధిలో కుది గ్రామంలో మహాభద్రకాళి ఆలయం ఉంది. ఈ ఆలయానికి గ్రామానికి చెందిన ఓ యువతి రోజు వస్తూ ఉండేది. కొన్ని రోజుల నుంచి యువతిలో మార్పులు వచ్చాయి. డైలీ గుడికి వస్తూ..అమ్మవారి కూతురిగా భావించడం మొదలు పెట్టింది. ఇది కాస్తా పీక్ స్టేజీకి వెళ్లిపోయింది. తెల్లవారుజామున గుడికి వెళ్లింది. అనంతరం తన గొంతు కోసుకుని వచ్చిన రక్తాన్ని అమ్మవారికి సమర్పించింది.

Read More : Palm Trees : తాటిచెట్ల పెంపకంపై స్టాలిన్ సర్కార్ దృష్టి…ఎందుకంటే..

గొంతు కోసుకున్న ప్రాంతంలో తీవ్రగాయం కావడంతో విలవిల్లాడింది. అనంతరం గుడి గంటలకు ఉరి వేసుకుని చనిపోయింది. ఇంటికి ఇంకా రాకపోవడంతో అనుమానం వచ్చి ఆలయానికి వచ్చారు. ఆలయ తలుపులు బంద్ ఉండడంతో…వాటిని బద్దలు కొట్టారు. యువతి విగతజీవిగా కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేయకుండా..అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని యువతి మృతిపై ఆరా తీస్తున్నారు. మూఢనమ్మకాల కారణంగా ఆత్మహత్య చేసుకుందా ? లేక ఎవరైనా హత్య చేసి ఇలా చేశారా ? పోలీసులు అనుమానిస్తున్నారు.