Nakul Nath Sensational Comments : రాహుల్ భారత్ జోడో యాత్రపై కమల్ నాథ్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.

Nakul Nath Sensational Comments : రాహుల్ భారత్ జోడో యాత్రపై కమల్ నాథ్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు

NAKUL NATH

Updated On : December 20, 2022 / 3:04 PM IST

Nakul Nath Sensational Comments : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్బంగా ఏర్పాటు చేసిన సభలకు వచ్చిన జనం కన్నా తన ర్యాలీలకే ఎక్కువ మంది వచ్చారని పేర్కొన్నారు.

ఈ మేరకు నకుల్ నాథ్ చేసిన వ్యాఖ్యలతో ఉన్న వీడియోను బీజేపీ నేతలు షేర్ చేశారు. రాహుల్ గాంధీతో కలిసి తాను మధ్యప్రదేశ్ అంతటా తిరిగానని, అయితే బెరసియాలో నిర్వహించిన
భారత్ జోడో యాత్ర కంటే తన సభకే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారని నకుల్ నాథ్ చెబుతున్నట్లు ఆ వీడియో క్లిప్ లో ఉంది.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాజస్తాన్ రాజకీయం.. అదును చూసి హల్ చల్ చేసిన సచిన్ పైలట్‭ వర్గీయులు

బీజేపీ ప్రతినిధి షెజాద్ పూనావాలా.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ వీడియోను షేర్ చేస్తూ కాంగ్రెస్ అగ్రినేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నేతగా కాంగ్రెస్ నేతలే పరిగణించడం లేదని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు దేశ ప్రజలు, ఇతర భాగస్వామ్యపక్షాలు రాహుల్ గాంధీని ఎందుకు సీరియస్ గా తీసుకుంటారని ప్రశ్నించారు.