సీనియర్‌ మహిళా క్రికెటర్‌ డయానా ఎడుల్జీకి అరుదైన గౌరవం

  • Published By: veegamteam ,Published On : March 8, 2019 / 08:28 AM IST
సీనియర్‌ మహిళా క్రికెటర్‌ డయానా ఎడుల్జీకి అరుదైన గౌరవం

Updated On : March 8, 2019 / 8:28 AM IST

రాంచీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్‌ మహిళా క్రికెటర్‌, బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీకి అరుదైన గౌరవం దక్కింది. రాంచీ స్టేడియం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఎడుల్జీ టాస్‌ కాయిన్‌ తీసుకొచ్చారు.
Also Read : ధోనీ.. 33 పరుగుల దూరంలో ఉన్న రికార్డు కొట్టేస్తాడా..

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి ఆ కాయిన్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ అవకాశం తనకు ఇచ్చిన ఇండియన్‌ క్రికెట్‌కు ధన్యవాదాలు తెలిపారు. మహిళా క్రికెట్‌కు మరింత ఊతమివ్వడానికి తాను కృషి చేస్తానని ప్రామిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

దేశంలోని మహిళలందరికీ ఎడుల్జీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు మున్ముందు క్రికెట్‌ రంగాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. భారత మహిళా జట్టు కూడా ఇటీవల బాగా రాణిస్తోందని కొనియాడారు.
Also Read : INDvAUS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్