Sonali Phogat death: ఆ మూడు డైరీల్లో ఏముంది? సోనాలీ ఫోగాట్ మృతి కేసు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

బీజేపీ నేత, సినీ నటి సోనాలీ ఫోగాట్ (42) గోవా పర్యటన సమయంలో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా మృతిరాలి నివాసంలో పోలీసులు మూడు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో ఆమె ఇతర రాష్ట్రాల్లో పలు విధాలుగా పెట్టిన పెట్టుబడులకు సంబంధించి వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Sonali Phogat death: ఆ మూడు డైరీల్లో ఏముంది? సోనాలీ ఫోగాట్ మృతి కేసు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

Sonali Phogat

Updated On : September 3, 2022 / 12:04 PM IST

Sonali Phogat death: బీజేపీ నేత, సినీ నటి సోనాలీ ఫోగాట్ (42) గోవా పర్యటన సమయంలో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలున్నట్లు తేలిసింది. కేసు నమోదు చేసిన గోవా పోలీసులు మృతి కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవా పోలీసులు మూడు రోజుల క్రితం హరియాణా చేరుకొని ఈ కేసుపై విచారణ చేస్తున్నారు. హిస్సార్ జిల్లాలోని సంత్ నగర్ ప్రాంతంలో గల సోనాలీ ఫోగాట్ నివాసంలో చేసిన తనిఖీల్లో మూడు డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Sonali Phogat Murder Case : సోనాలి ఫోగట్‌ హత్య కేసులో పురోగతి..గోవా క్లబ్ యజమాని, డ్రగ్ డీలర్ అరెస్టు

ఈ డైరీల్లో ఏముందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ డైరీలో ఏముందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. గదిలో లభ్యమైన డైరీల్లో ప్రస్తుతం అరెస్టై పోలీసుల అదుపులో ఉన్న సోనాలీ పీఏ సుధీర్ సంగ్వాన్ ద్వారా జరిపిన లావాదేవీల వివరాలను రాసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికితోడు సోనాలీ ఇతర రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన వివరాలు కూడా ఉండొచ్చనే చర్చ జోరుగా సాగుతుంది. ఇదిలాఉంటే డైరీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు లాకర్ లోని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Sonali Phogat death: గుండెపోటు నుండి హత్య వరకు.. సోనాలి ఫోగట్ మృతికేసులో కీలక ములుపులు.. తాజాగా డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్ అరెస్ట్

సోనాలీ తన పీఏ సుధీర్ తో కలిసి సహజీవనం చేశారని, ఇందుకు సాక్ష్యంగా గురుగ్రామ్ లోని ఓ అద్దె ఇంట్లో వీరిద్దరూ కలిసి ఉండేవారని, ఆ ఇంటి అద్దె పత్రాల్లోనూ సోనాలీని సుధీర్ భార్యగా పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో ఆస్తి విషయంలో గొడవులు రావడం వల్లనే సోనాలీని హత్యచేసి ఉంటారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే సోనాలీ భర్త కొన్నేళ్ల కిందటే మరణించారు. వారికి ఒక కుమార్తె ఉంది.