Covid Vaccine : పిల్లలపై కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్.. సీరమ్‌కు కీలక అనుమతులు

వ్యాక్సిన్ తయారీదారు సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు దేశ డ్రగ్ కంట్రోలర్ కీలక అనుమతులు ఇచ్చింది. అమెరికా ఔషధ తయారీదారు నోవావాక్స్ COVID-19 వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం టీకా తయారీదారు సీరం..

Covid Vaccine : పిల్లలపై కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్.. సీరమ్‌కు కీలక అనుమతులు

Covid Vaccine

Updated On : September 28, 2021 / 5:28 PM IST

Covid Vaccine : వ్యాక్సిన్ తయారీదారు సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు దేశ డ్రగ్ కంట్రోలర్ కీలక అనుమతులు ఇచ్చింది. అమెరికా ఔషధ తయారీదారు నోవావాక్స్ COVID-19 వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం టీకా తయారీదారు సీరం ఇన్ స్టిట్యూట్ 7-11 సంవత్సరాల వయస్సు గల పిల్లలను నమోదు చేయడానికి దేశ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది.

“వివరణాత్మక చర్చ తర్వాత, ప్రోటోకాల్ ప్రకారం 7 నుండి 11 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల నమోదుకు అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది” అని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ తెలిపింది.

Milk Dairy: సాఫ్ట్‌వేర్ వదిలి పాలడైయిరీతో సక్సెస్

సీరం ఇనిస్టిట్యూట్ ఇప్పటికే తన COVID-19 వ్యాక్సిన్ కోవోవాక్స్(దేశీయంగా ఉత్పత్తి చేయబడిన నోవావ్యాక్స్) కు సంబంధించి 12-17 ఏజ్ గ్రూపు వారిపై ట్రయల్ నిర్వహిస్తోంది. 100 మంది పార్టిసిపెంట్స్ భద్రతా డేటాను అందించింది. కాగా, నోవావాక్స్ వ్యాక్సిన్ కు ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది.

వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి కోవోవాక్స్ ఆమోదించబడాలని ఆశిస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలో సీరం ఇన్ స్టిట్యూట్ చీఫ్ అదర్ పూనావాల చెప్పారు.

Bank Holidays: అక్టోబరులో బ్యాంకులకు 21రోజుల పాటు సెలవులు

ఇప్పటివరకు ఔషధ తయారీదారు జైడస్ కాడిలా DNA కోవిడ్ -19 వ్యాక్సిన్ మాత్రమే 12 సంవత్సరాల, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అడల్ట్స్, పిల్లలకు ఉపయోగించడానికి దేశంలో అత్యవసర వినియోగ ఆమోదం పొందింది.