చంపేస్తామంటూ.. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు బెదిరింపులు.. పోలీసులు ఏం చేశారంటే?

బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసు ల్యాండ్ లైన్ నంబర్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి

చంపేస్తామంటూ.. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు బెదిరింపులు.. పోలీసులు ఏం చేశారంటే?

Shah Rukh Khan

Updated On : November 7, 2024 / 2:33 PM IST

Shah Rukh Khan Death Threat: బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసు ల్యాండ్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి షారూక్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ముంబైలోని బాంద్రా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సైబర్ పోలీస్ స్టేషన్ సహకారంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ముంబై పోలీసుల బృందం విచారణలో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించినట్లు సమాచారం. దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఓ పోలీస్ బృందం ఛత్తీస్ గఢ్ కు బయలుదేరినట్లు తెలిసింది.

Also Read: Salman Khan : సల్మాన్ ఖాన్ బెదిరింపు కేసులో ఓ వ్యక్తి అరెస్ట్..

ఇదిలాఉంటే.. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు పలుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ పై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఓ మెస్సేజ్ కూడా పోలీసులకు వచ్చింది. రూ.5కోట్లు ఇవ్వకుంటే సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని ఆ మెస్సేజ్ లో గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీంతో సల్మాన్ ఖాన్ కు భద్రతను పెంచారు. తాజాగా సల్మాన్ ను బెదిరిస్తున్న గ్యాంగ్ నుండి ఓ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ కి చెందిన 32 ఏళ్ళ వ్యక్తితో సల్మాన్ కి బెదిరింపులు వస్తున్న కేసు తో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కర్ణాటకలో నిందితుడు పట్టుబడగా మహారాష్ట్ర పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

సల్మాన్ ఖాన్ తోపాటు.. తాజాగా షారూక్ ఖాన్ పైకూడా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడంతో బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. పోలీసులు కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.