మహా రాజకీయం : రాజ్ భవన్ కు చేరుకున్న శివసేన నేతలు

శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్, రామ్ దాస్ కదమ్ లు సోమవారం సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చారు. వారు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో భేటీ అయ్యారు. తమ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని వారు గవర్నర్ ను కోరనున్నారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం పీఠం కోసం బీజేపీ శివసేన మధ్య రేగిన వివాదం సమసిపోలేదు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల పాటు రెండు పార్టీలు పంచుకుందామని శివసేన డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. బీజేపీ అందుకు ఒప్పుకోవటం లేదు.
288 అసెంబ్లీ స్ధానాలు ఉన్న మహారాష్ట్రంలో బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపొందాయి. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన వాదిస్తోంది. ఈ సంఖ్య 175 కూడా పెరగొచ్చని పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు.
Mumbai: Shiv Sena leaders Ramdas Kadam and Sanjay Raut met Maharashtra Governor Bhagat Singh Koshyari. pic.twitter.com/p0T2XFZgL8
— ANI (@ANI) November 4, 2019