ఇండియాలో కరోనాకు ట్రీట్‌మెంట్ చేసేందుకు సరిపడా డాక్టర్లు లేరట!

భారత్‌లో మార్చి 4 బుధవారం నాటికి ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకవేళ దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రబలితే వాటిని ఎదుర్కొనేందుకు సరిపడ సంఖ్యలో డాక్టర్లు లేరంట. అది జరగకముందే హాస్పిటళ్లలో డాక్టర్లను, మెడికల్ స్టాఫ్‌ను అలర్ట్ చేయాలని.. మామూలు వార్డులను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుత అంచనా ప్రకారం.. హెల్త్ వర్కర్స్, హాస్పిటల్ బెడ్స్, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేవు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, స్టేట్ మెడికల్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్‌లో రిజిష్టర్ చేసుకున్న వివరాల ప్రకారం.. భారత్‌లో 11లక్షల మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. వారిలోనూ 9.26లక్షల మంది డాక్టర్లే ప్రస్తుతం సర్వీసు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. (హైదరాబాద్ ఐటీసెక్టార్‌లో కరోనా కలకలం : మైండ్‌స్పేస్ ఉద్యోగికి పాజిటివ్ లక్షణాలు)
కరోనా టెస్టులు చేయాలనుకుంటే AIIMSలో వారం రోజుల్లో 300శాంపుళ్లను మాత్రమే పరీక్షించగలరు. ప్రస్తుతమున్న ల్యాబ్‌లు సరిపోవని 19ల్యాబ్‌లను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అధికారిక ప్రకటన చేశారు. 12మంది భారతీయులు, 16మంది విదేశీయులకు కరోనా సోకిందని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన 16మంది ఇటలీ దేశీయులకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. 14మంది పర్యాటకులను తీసుకెళ్లిన డ్రైవర్ కు కూడా కరోనా సోకింది. ఢిల్లీలో 14మందికి, జైపూర్ లో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు.
కరోనా రోగి నుంచి మరో ఆరుగురికి వైరస్:
ఢిల్లీలో కరోనా రోగి నుంచి మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఆగ్రాలోని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఆ ఆరుగురికి ఆగ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా కేరళలోని ముగ్గురు మాత్రమే కరోనా నుంచి కోలుకున్నారు. ఇంతలోనే కరోనా కేసులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.