ప్రైవేటీకరణకు మరో 6 ఎయిర్‌పోర్టులు

ప్రైవేటీకరణకు మరో 6 ఎయిర్‌పోర్టులు

Updated On : December 2, 2019 / 5:15 AM IST

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) మరో 6 ఎయిర్‌పోర్టులను ప్రైవేటికరణ చేయాలంటూ కేంద్రానికి విన్నవించింది. అమృత్‌సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, త్రిచీ విమానాశ్రయాలను సైతం ప్రైవేటీకరణ చేయాలని కోరినట్లు ప్రభుత్వాధికారి వెల్లడించారు. 

కేంద్రం ఫిబ్రవరిలోనే లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటిలను ప్రైవేటీకరణ(పీపీపీ) చేసింది. సెప్టెంబర్ 5న జరిగిన సమావేశంలో మరో 6విమానాశ్రయాలను కూడా అదే దిశగా చేయాలని చర్చ జరిగింది. బోర్డు ఈ ప్రతిపాదనను పౌర సరఫరాల శాఖకు పంపింది. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదీనంలో దేశవ్యాప్తంగా 100ఎయిర్‌పోర్టులు ఉన్నాయి.