దీదీ కాదు హిట్లర్ : మమత పోరాటంపై సెటైర్లే సెటైర్లు

దీదీ కాదు హిట్లర్ : మమత పోరాటంపై సెటైర్లే సెటైర్లు

Updated On : February 5, 2019 / 11:30 AM IST

ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై స్పందించడానికి సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. ఎంతలా అంటే తమతమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కార్టూన్ల రూపంలో బహిరంగంగా తెలియజేసేంతలా తయారైంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీక్షకు దిగారు. అంతే.. క్షణాల్లో ఆవిడపై విమర్శల వెల్లువ మొదలైంది. మమతాను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ నెటిజన్లు కార్టూన్లతో ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

 

సీబీఐ కేంద్రం తోలుబొమ్మగా మారిందంటూ అధికార పార్టీ ఏది చెప్తే అదే చేస్తుందంటూ మమతా తీవ్రంగా విమర్శించారు. వాటిని వాడుకుని మమతాను పోలీసు గెటప్‌లలో, సూపర్ హీరోలతోనూ పోలుస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ దీక్షపై విముఖత వ్యక్తం చేసిన బీజేపీ ఉత్తరప్రదేశ్.. ‘దేశమంతా నీ అజమాయిషీని చూస్తుంది. నీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నావు. వాళ్లు నీకు సరైన సమాధానం చెప్తారు’ అంటూ ట్వీట్ చేసింది. ఈ కార్టూన్‌తో మమతా బెనర్జీను హిట్లర్ దీదీని చేసేసేంది బీజేపీ. నేరుగా సీబీఐతోనే తలపడేందుకు సిద్ధమైంది మమతా అంటూ బీజేపీ కార్యకర్తలు సైతం కామెంట్లు చేస్తున్నారు.