గ్రహణం వల్ల అన్నీ శుభ ఫలితాలే ఉంటాయి.

మూల నక్షత్రం, మకర లగ్నం, ధనురాశి, షష్ట గ్రహకూటమి సమయంలో డిసెంబర్ 26, 2019 న గ్రహణం రావటం వల్ల ఎంతో ఉపయోగం ఉందని ఇది మంచికే అంటున్నారు బాలాపూర్ ప్రధాన అర్చకులు కోటేశ్వరశర్మ గారు. ఈ గ్రహణం వల్ల ఎవరూ భయడాల్సిన పని లేదని అన్నీ శుభపరిణామాలే ఉంటాయన్నారు.
10 టీవీ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ…గ్రహణం వల్ల వచ్చే అతినీల లోహిత కిరణాలు వల్ల వచ్చే నెగెటివ్ ఎనర్జీని అడ్డుకోవటానికే ఆలయాల్లో దేవతామూర్తుల పాదాల చెంత దర్భలు వేసి ఆలయాలు మూసివేస్తారని చెప్పారు.
ఆలయాల్లో గర్బగుడి ఉంటుంది. అక్కడ దేవతా మూర్తులు కొలువై ఉంటాయి. ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు వేసే యంత్రాలు వేసి ప్రతిష్ట జరుపుతూ ఉంటారు. ఆ యంత్ర బలం వల్ల ఆలయంలో చేసే పూజలు,యాగాల వల్ల అక్కడ పాజిటివ్ ఎనర్జీ పుడుతుంది. అమవాస్య సంభవించే సూర్యగ్రహణం వల్ల ప్రసరించే నెగెటివ్ ఎనర్జీ నుంచి కాపాడటానికే దర్భలు వేసి గుడి మూసి వేస్తారని ఆయన తెలిపారు.
దర్భ సంజీవని లాంటిదని..దర్భకు నెగెటివ్ ఎనర్జీని తగ్గించే శక్తి ఉందని ఆయన చెపుతూ…. గుడిలో స్వామి వారి పాదాల చెంత దర్భలు పెట్టటం వలన గుడిలో నెగెటివ్ ఎనర్జీ లేకుండా రక్షించబడుతోందని కోటేశ్వర శర్మ చెప్పారు. గ్రహణానంతరమే కాకుండా ప్రతిరోజు ఇంట్లో ఉప్పు, పసుపు, కాస్త గోమూత్రం వేసి ఇల్లు శుభ్రం చేసుకుంటే ఆఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోతుందని కోటేశ్వర శర్మ చెప్పారు.
దర్భలు నెగెటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయని చర్చలో పాల్గోన్న ఆధ్యాత్మికవేత్త రమాదేవి వివరించారు. గ్రహణం సమయంలో అతినీల లోహిత కిరణాలు ప్రసరించబడతాయి. అందుకనే పూర్వీకులు తినే వస్తువులపై దర్భలు వేయమని చెప్పారు.
గతంలో విదేశీయులు భారత్ కు వచ్చి తినే వస్తువులపై దర్భలు వేసే అంశంపై పరీక్షంచారని… వారు రెండు గ్లాసుల్లో నీరు తీసుకుని, 1దానిలో దర్భ వేశారు. 2వ దానిలో దర్భ వేయలేదు. గ్రహణ సమయంలో దర్భ వేసిన నీరు స్వచ్ఛంగా ఉందని, దర్భ లేని గ్లాసులో నీరు గ్రహాణానంతరం పరీక్షంచగా విషతుల్యమైనట్లు వారు గుర్తించారని ఆమె వివరించారు. గ్రహణ సమయంలో చేసిన జప, ధ్యానాలు కోటి రెట్లు ఫలితం వస్తాయని రమాదేవి చెప్పారు.