సోనియాజీ హ్యాపీ బర్త్ డే టూ యూ: మోడీ

సోనియాజీ హ్యాపీ బర్త్ డే టూ యూ: మోడీ

Updated On : December 9, 2019 / 5:46 AM IST

కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. మేడమ్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరందరి కంటే భారత ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ప్రత్యేకత సంతరించుకుంది. ‘శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. చాలా కాలం ఆరోగ్యంతో జీవించాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. 

దేశ వ్యాప్తంగా జరుగుతున్న రేప్ ఉదంతాలు, పెరుగుతున్న మహిళల అభద్రతలను దృష్టిలో ఉంచుకుని సోనియా పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడదని అనుకుంటున్నారు. ఈ మేర కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా పోస్టు చేశారు. 

 

‘కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా సుదీర్ఘంగా పాలిస్తున్న సోనియా గాంధీ తరాలుగా వస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహిస్తున్నారు. ఆమె బలం, గౌరవం, జాలి, కరుణ మమ్మల్ని ఏకం చేసింది. మరింత బలపడేలా చేసింది. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా విషెస్ తెలియజేసింది. 

సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుమారి సెల్జా, మనీశ్ తివారీ, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, మిలింద్ డియోరా, మహిళా కాంగ్రెస్ చీఫ్ సుశ్మితా దేవ్, యువజన కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీలు సోమవారం ఉదయం నుంచి విషెస్ తెలియజేస్తున్నారు.