Sonu sood: మరోసారి ఉదారత చాటుకున్న సోనూసూద్..

సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ నిజ జీవితంలో హీరో అని అందరికీ తెలుసు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి ఆర్థిక సాయం చేసే వ్యక్తుల్లో సోనూసూద్ ముందుంటారు..

Sonu sood: మరోసారి ఉదారత చాటుకున్న సోనూసూద్..

Sonu Sood

Updated On : April 27, 2022 / 8:56 AM IST

Sonu sood: సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ నిజ జీవితంలో హీరో అని అందరికీ తెలుసు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి ఆర్థిక సాయం చేసే వ్యక్తుల్లో సోనూసూద్ ముందుంటారు. కొవిడ్ సమయంలో దేశంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో సోనూసూద్ దేశవ్యాప్తంగా తనను ఆశ్రయించిన వారికి అందించిన సాయం అంతాఇంతా కాదు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వలస కూలీలను వారివారి ప్రాంతాలకు తరలించారు. అంతేకాక కొందరి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించి మంచి మనసును చాటు కున్నారు. దేశంలో లాక్ డౌన్ సమయంలో ఆర్థిక సాయాలతో దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు మారు మోగిపోయింది. తాజాగా సోనూసూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

SonuSood : సోదరితో కలిసి 1000 మందికి సైకిల్స్ పంపిణి చేసిన రియల్ హీరో సోనూసూద్

మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన 16నెలల చిన్నారి విహాన్ స్పైనల్ మస్కులర్ ఆత్రోపి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. వెన్నెముఖ కండరాల క్షీణత ఈ వ్యాధి లక్షణం. ఈ వ్యాధికి జాల్ గెన్జ్ మా అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో ఉండే ఈ ఇంజక్షన్ ఇవ్వాలంటే రూ. 16కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే అంత ఖరీదైన ఇంజక్షన్ ఇప్పించే స్థోమత ఆ బాబు తల్లిదండ్రులకు లేదు. దీంతో రూ. 16కోట్లు సేకరించేందుకు విరాళాలు చేపట్టారు.

Sonu Sood: చిక్కుల్లో సోనూసూద్.. కేసు నమోదు.. కారు సీజ్!

ఇప్పటి వరకు ఈ చిన్నారికి సాయం చేసేందుకు బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, మనోజ్ జాబ్పాయ్ వంటి ప్రముఖులు ముందుకొచ్చారు. అయితే విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులకు సోనూసూద్ తనవంతు సాయం అందించాడు. మరోవైపు సోషల్ మీడియా, సన్నిహితుల ద్వారా చిన్నారి తల్లిదండ్రులు విరాళాలు సేకరించారు. అయితే మొత్తం రూ. 4కోట్ల విరాళాలు రాగా అందులో సోనూ సూద్ అందించిన విరాళమే ఎక్కువ. అంతేకాదు ఆస్పత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. ఇక విహాన్ బతకాలంటే నెలరోజుల్లో రూ. 12కోట్లు సమకూర్చాల్సి ఉంది.