కశ్మీర్ లో కలకలం : 8మంది LeTఉగ్రవాదులు అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : September 10, 2019 / 02:17 AM IST
కశ్మీర్ లో కలకలం : 8మంది LeTఉగ్రవాదులు అరెస్ట్

Updated On : September 10, 2019 / 2:17 AM IST

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రకలకలం రేగింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల సహచరులైన 8మంది కీలక సూత్రధారులను మంగళవారం(సెప్టెంబర్-9,2019)సోపోరే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి కంప్యూటర్లు, పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు అత్యంత కీలక సహచరులైన వీరు పలు దాడులకు వ్యూహం రూపొందించారని సమాచారం.

అరెస్ట్ అయిన 8మందిని.. ఒమర్ మీర్, ఒమర్ అక్బర్, ఫైజాన్ లతీఫ్,దానిష్ హబీబ్, షౌకత్ అహ్మద్ మీర్,తౌసీఫ్ నజార్, ఇంతియాజ్ నజార్, ఐజాజ్ మీర్ లగా గుర్తించారు. స్థానిక పౌరులపై దాడులు చేయించి వారిని హతమార్చిన కేసులో వీరు నిందితులని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల తరపున వీరు పోస్టర్లు తయారు చేసి వాటిని గోడలపై అతికిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇన్వేస్టిగేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.