బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్‌కు భంగపాటు తప్పదు
ప్రతిపక్ష ఇండియా కూటమిని పడదోసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా బిహార్‌లో రాజకీయ సంక్షోభాన్ని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వర్ణించారు.

Strategist Prashant Kishor comments on Bihar Chief Minister Nitish Kumar
Prashant Kishor: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయేలోకి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ కు భంగపాటు తప్పదని ఆజ్ తక్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మోసకారి అయిన నితీశ్ తన జీవితంలో చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాఘట్‌బంధన్‌ను వదిలి ఎన్డీయే కూటమితో జతకట్టి నితీశ్ కుమార్ ఆదివారం 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ, బీజేపీ కూటమి 2025 అసెంబ్లీ ఎన్నికల వరకు నిలబడటం కష్టమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఏ కూటమితో కలిసి పోటీ చేసినా నితీశ్ కుమార్ 20 సీట్లకు మించి గెలవలేరు. 20కి పైగా సీట్లు వస్తే నేను నా ఉద్యోగాన్ని వదులుకుంటానని చెప్పారు. నితీశ్‌ను ప్రజలు తిరస్కరించారని.. అందుకే తన కుర్చీని కాపాడుకోవడానికి మళ్లీ బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు.
Also Read: నిజాయితీ, నిరాడంబరతకు అప్పుడు నితీశ్ మారుపేరు.. ఇప్పుడు ఎందుకు మారిపోయారో తెలుసా?
ప్రతిపక్ష ఇండియా కూటమిని పడదోసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా బిహార్‌లో రాజకీయ సంక్షోభాన్ని ఆయన వర్ణించారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో జేడీయూతో జతకట్టకుండా ఒంటరిగా పోటీ చేస్తేనే బీజేపీకి లాభం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాషాయ పార్టీ సోలోగా ఎన్నికలకు వెళితేనే స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటుందని అంచనా వేశారు.
Also Read: జేడీయూతో దోస్తీ వద్దన్న బీజేపీ ఇప్పుడెందుకు రాజీపడినట్టు..? కమలం వ్యూహాం ఇదేనా?