Subodh Kumar Jaiswal : సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీవోపీటీ) మంగళవారం(మే 25,2021) ఉత్తర్వులు జారీ చేసింది. సుబోధ్‌కుమార్‌ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. 1985 మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సుబోధ్...గతంలో మహారాష్ట్ర డీజీపీగా పని చేశారు. ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Subodh Kumar Jaiswal : సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌

Subodh Kumar Jaiswal

Updated On : May 26, 2021 / 7:12 AM IST

CBI Director Subodh Kumar Jaiswal : సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీవోపీటీ) మంగళవారం(మే 25,2021) ఉత్తర్వులు జారీ చేసింది. సుబోధ్‌కుమార్‌ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. 1985 మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సుబోధ్…గతంలో మహారాష్ట్ర డీజీపీగా పని చేశారు. ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై సోమవారం ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరితో కూడిన కమిటీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కమిటీ ముగ్గురు పేర్లను ఎంపిక చేసింది. చివరికి సుభోధ్‌ కుమార్‌ను ఖరారు చేసింది.