Sudha Murthy : రాజ్యసభకు నామినేట్ అయిన సుధా మూర్తి.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

Sudha Murthy : రాజ్యసభకు నామినేట్ అయిన సుధా మూర్తి.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

Sudha Murthy

Sudha Murthy nominated to Rajya Sabha : ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సామాజిక సేవా రంగాల్లో సుధామూర్తిది స్ఫూర్తిదాయ ముద్ర అని కొనియాడారు. ఆమె రాజ్యసభలో ఉండటం ‘నారీ శక్తి’కి ఒక శక్తివంతమైన నిదర్శనం. దేశం నిర్మాణంలో మహిళల శక్తి, సామర్థ్యాన్నిచాటిచెప్పడానికి ఉదాహరణ. ఆమెకు విజయవంతమైన పార్లమెంటరీ పదవీకాలం కావాలని కోరుకుంటున్నాను అని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : International Women’s Day 2024 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఆమె.. శక్తి స్వరూపిణి.. బాంధవ్యాలకు వారథి..!

సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్. ఆమె ఉపాధ్యాయ వృత్తిలోనూ కొనసాగారు. రచయిత్రి కూడా.. ఎన్నో పుస్తకాలు రాశారు. 1950 ఆగస్టు 19న షిగావ్ లో జన్మించారు. ఆమె 1978లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తిని వివాహం చేసుకున్నారు. వారికి కొడుకు, కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు రోహన్ మూర్తి. కుమార్తె అక్షతా మూర్తి ఉన్నారు. అక్షతా మూర్తి బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ సతీమణి. సుధామూర్తి.. పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి ఆమె విశేష కృషి చేస్తున్నారు.

 

ఇదిలాఉంటే 2006లో ఆమె చేసిన సేవకుగానూ ప్రభుత్వం భారతదేశపు నాల్గో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించింది. 2023 ఏప్రిల్ 5న రాష్ట్రపతి చేతులు మీదుగా భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డును సుధామూర్తి అందుకున్నారు.

Also Read : LPG Cylinder : మహిళలకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ.. వంటగ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు..