టిక్ టాక్ బ్యాన్ పొడిగించిన సుప్రీం కోర్టు
టిక్ టాక్ యాప్‌ను నిషేదించాలంటూ గూగుల్, యాపిల్‌లు కలిసి ప్రభుత్వాన్ని చేసిన రిక్వెస్ట్‌కు అనుకూల తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు.

టిక్ టాక్ యాప్‌ను నిషేదించాలంటూ గూగుల్, యాపిల్‌లు కలిసి ప్రభుత్వాన్ని చేసిన రిక్వెస్ట్‌కు అనుకూల తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు.
టిక్ టాక్ యాప్‌ను నిషేదించాలంటూ గూగుల్, యాపిల్‌లు కలిసి ప్రభుత్వాన్ని చేసిన రిక్వెస్ట్‌కు అనుకూల తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. చైనా ఆధారిత యాప్ అయిన టిక్ టాక్‌ను తమిళనాడులో నిషేదించాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
కేసును పరిశీలించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని కమిటీ తీర్పును ఏప్రిల్ 22 నాటికి వాయిదా వేసింది. మద్రాస్ హైకోర్టు విధించిన నిషేదం అప్పటి వరకూ కొనసాగుతుందని చెప్తూనే గూగుల్, ఆపిల్ సంస్థలను టిక్ టాక్ వాడకంలో ఉండడం వల్ల నష్టాలేంటో చెప్పాలని ఆదేశించింది. యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్‍ను తొలిగించాలని పేర్కొంది.
Read Also : హైదరాబాద్‌లో లోన్ మోసం: నమ్మారో బ్యాంకులో మొత్తం నొక్కేస్తారు
కొద్ది రోజుల ముందే టిక్ టాక్‌లో అభ్యంతరకర వీడియోలు ఉన్నాయంటూ ఫిర్యాదు అందడంతో 6 మిలియన్ వీడియోలను తొలగించింది టిక్ టాక్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాప్‌లలో గూగుల్, ఆపిల్ తర్వాత టిక్ టాక్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఖాతాదార్లుగా 88.6 మిలియన్ యూజర్లు ఉన్నారట.
టిక్ టాక్, హలో యాప్‌లు దేశ వ్యాప్తంగా టీనేజర్‌లను, యువతపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ గూగుల్, ఆపిల్ స్టోర్లు కంప్లైట్ చేశాయి. ఇప్పటికే ఇటువంటి కంటెంట్ మీద యూఎస్, యూకే, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల్లో ఈ యాప్‌లు పూర్తిగా నిషిద్ధం.
Read Also : హైదరాబాద్ లో దారుణం : మందు పార్టీ ఇచ్చి.. యువతిపై గ్యాంగ్ రేప్