Sedition Act: దేశ ద్రోహం చట్టంపై కేంద్రం వైఖరిపై ఒక్క రోజు గడువు ఇచ్చిన సుప్రీం కోర్టు

దేశ ద్రోహం చట్టం చెల్లుబాటు అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మే 11 వరకు గడువు ఇచ్చింది

Sedition Act: దేశ ద్రోహం చట్టంపై కేంద్రం వైఖరిపై ఒక్క రోజు గడువు ఇచ్చిన సుప్రీం కోర్టు

Supreme

Sedition Act: దేశద్రోహ చట్టంపై కఠినంగా వ్యవహరిస్తూ, ఈ చట్టంపై ఇప్పుడు కేసులు నమోదు చేస్తారా లేదా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశ ద్రోహం చట్టం చెల్లుబాటు అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మే 11 వరకు గడువు ఇచ్చింది. దేశంలో ఇప్పటివరకు IPC 124-A చట్టం ప్రకారం నమోదైన కేసులపై ఏమి జరుగుతుంది? ఈ చట్టంపై సమీక్ష ప్రక్రియ పూర్తయ్యే వరకు 124ఏ కింద కేసులను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు ఆదేశించడం లేదు? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. కేసు విచారణ సందర్భంగా, సమీక్ష ప్రక్రియకు ఎంత సమయం పడుతుందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..రివ్యూ ప్రక్రియ ప్రారంభమైందని కోర్టుకు తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రతను దృష్టిలో ఉంచుకుని దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం నిర్ణయించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

Also read:Red Alert in Punjab: రాకెట్ దాడి నేపథ్యంలో అమృత్‌సర్‌లో ‘రెడ్ అలెర్ట్’: ఎక్కడిక్కడే తనిఖీలు

అయితే శిక్ష అనే నిబంధన దీని నుండి తొలగించబడదని, ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని శిక్షించకూడదని ఎవరూ చెప్పలేరని తుషార్ మెహతా వాదించారు. దేశద్రోహ చట్టాన్ని దుర్వినియోగం చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈసందర్భంగా ఎంపీ నవనీత్ రాణా అంశాన్ని లేవనెత్తింది. ‘హనుమాన్ చాలీసా చదవడం కోసం దేశద్రోహ చట్టం విధిస్తున్నారని అటార్నీ జనరల్ స్వయంగా చెప్పారు’ అంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో కూడిన ధర్మసనం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది. కేంద్రం కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది.

Also read:Minister Nitin Gadkari : ‘‘గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో విడ్డూరంగా ఉందే’’..అంటూ ఆశ్చర్యపోయిన కేంద్రమంత్రి గడ్కరి