ఇంకెంత మంది ఉన్నారు! : పాక్ గూఢచారి అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : January 9, 2019 / 11:02 AM IST
ఇంకెంత మంది ఉన్నారు! : పాక్ గూఢచారి అరెస్ట్

Updated On : January 9, 2019 / 11:02 AM IST

పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి చెందిన గూఢచారిగా అనుమానిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లోని అంజ్వా జిల్లాలోని భారత్-చైనా సరిహద్దుల్లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు  భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. అరెస్ట్ అయిన వ్యక్తిని నిర్మల్ రాయ్ గా గుర్తించారు. నిర్మల్ రాయ్  అస్సాంలోని టిన్ సుఖియా జిల్లాలోని సదియా ప్రాంతానికి  చెందినవాడుగా గుర్తించారు. రెండు దేశాల భద్రత సిబ్బంది ఉండే లైన్ ఆప్ యాక్చువల్ కంట్రోల్(LAC) కిబిత్తు, డిచ్చు దగ్గర నిర్మల్ రాయ్ ఇండియన్ ఆర్మీ పోర్టర్(కూలీ)గా పనిచేసేవాడని అరుణాచల్ ప్రదేశ్ డీజీపీ ఎస్ బీకే సింగ్ తెలిపారు.

రాయ్ నేపాలీ క్యూనిటీకి చెందినవాడని, కిబిత్సుకి రాకముందు 2016-18 మధ్యకాలంలో దుబాయ్ లోని బర్గర్ షాపుల్ పనిచేశాడని తెలిపారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. అనుమానంగా కన్పించడంతో నెల రోజులుగా అతడిపై నిఘా పెట్టి అరెస్ట్ చేసినట్లు మిలటరీ వర్గాలు తెలిపాయి. ఆర్మీ యూనిట్లు, సెన్సీటీవ్ ఏరియాల లొకేషన్ సమాచారం, ఆయుధాల ఫ్రొఫైల్స్, కిబిత్సులో ఉండే గన్స్ వివరాలు, ఎల్ఏసీలో మౌలిక సదుపాయాలు, అభివృద్ది గురించిన సమాచారాన్ని రాయ్ ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు మిలటరనీ వర్గాలు తెలిపాయి.