Corona Vaccine: 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే.. పబ్‌లో 50% డిస్కౌంట్!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది. మరోవైపు థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ నుండి బయటపడాలంటే మనల్ని కాపాడే ఆయుధం టీకా. అందుకే వీలైనంత విస్తృతంగా వ్యాక్సిన్ అందించాలని మేధావుల సూచనలతో ప్రభుత్వం ముమ్మర చర్యలు మొదలు పెట్టింది..

Corona Vaccine: 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే.. పబ్‌లో 50% డిస్కౌంట్!

Corona Vaccine (1)

Updated On : June 20, 2021 / 4:17 PM IST

Corona Vaccine: దేశంలో కరోనా సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది. మరోవైపు థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ నుండి బయటపడాలంటే మనల్ని కాపాడే ఆయుధం టీకా. అందుకే వీలైనంత విస్తృతంగా వ్యాక్సిన్ అందించాలని మేధావుల సూచనలతో ప్రభుత్వం ముమ్మర చర్యలు మొదలు పెట్టింది. దీంతో టీకా కార్యక్రమం జోరందుకుంది. అయితే.. ఇదే సమయంలో కొందరి ప్రజలలో వ్యాక్సిన్ పట్ల అలసత్వం.. అపోహలు ఉండిపోయాయి.

అందుకే పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు వ్యాపార సముదాయాలు వ్యాక్సిన్ పట్ల ప్రజలలో అవగాహనా పెంచే కార్యక్రమాలను చేపట్టాయి. హరియాణాలో వ్యాక్సిన్ తీసుకున్న వారికోసం పలు రెస్టారెంట్లు​ వినూత్న ఆఫర్​లను అందిస్తున్నాయి. టీకా రెండు డోసులు తీసుకున్నవారికి 50శాతం, ఒక్కడోసు తీసుకున్నవారికి 25శాతం డిస్కౌంట్​ ఇస్తున్నాయి. గురుగ్రామ్​లోని పలు రెస్టారెంట్లు, పబ్​ల ముందు ఈ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఆఫర్లను ప్రకటించడం వలన ప్రజలు కొవిడ్-19 వ్యాక్సిన్​ వేయించుకునేందుకు ప్రోత్సహించినట్లు అవుతుందని.. దాంతో పాటు తమకూ లాభదాయకంగా ఉందని ఓ షాపింగ్​మాల్ డైరెక్టర్ తెలిపారు. పబ్స్, రెస్టారెంట్లతో పాటు గురుగ్రామ్ లో మరికొన్ని ప్రదేశాల్లో.. ఆరోగ్యసిబ్బందికి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. ఉచితంగా పార్కింగ్ సౌకర్యం, ప్రత్యేక డిస్కౌంట్​లను అందిస్తున్నామని ఓ షాపింగ్​మాల్​ యజమాని పేర్కొన్నారు.