Liquor swamy : లిక్కర్ బాబా..మీ జాతకం తెలుసుకోవాలంటే..ఫుల్ బాటిల్ తాగాల్సిందే

మీరు ఫుల్ బాటిల్ మద్యం తాగండీ..మీ జాతకం ఏంటో నేను చెబుతాను అంటున్న లిక్కర్ స్వామీజీ..భారీగా తరలి వస్తున్న భక్తులు..

Liquor swamy : లిక్కర్ బాబా..మీ జాతకం తెలుసుకోవాలంటే..ఫుల్ బాటిల్ తాగాల్సిందే

Tamil Nadu Liquor Swamyji

Updated On : September 4, 2021 / 2:04 PM IST

Tamil Nadu Liquor swamyji : ఎవరన్నా స్వామీజీలను ప్రసన్నం చేసుకోవాలంటే వారికి కానుకలు సమర్పించాలి.లేదా సేవలు చేయాలి. లేదా భజనలు చేయాలి. కానీ తమిళనాడులో ఓ స్వామీజీ స్టైలే వేరు. ఆ స్వామీజీని ప్రసన్నం చేసుకోవాలంటే ఫుల్ బాటిల్ మందు తాగాలి. అలా తాగితేనే బాబాగారు ప్రసన్నం అవుతారు. మీ జాతకం ఏంటో చెబుతారు.మీఆర్థిక పరిస్థితి ఎలా ఉందో..మీకష్టాల్లోంచి ఎలా బయటపడాలో చెబుతారు. ఈ స్వామీజీని ముద్దుగా లిక్కర్ స్వామీజీ అని పిలుచుకుంటారు భక్తులు. తమిళనాడు రాష్ట్రంలో వైరల్ గా మారిన ఆ లిక్కర్ స్వామీజీ విశేషాలేమంటే..

తమిళనాడు లోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ సమీపం లోని నెమిలి గ్రామంలో ‘మణి స్వామిజి’.ఈయనగారి వెరైటీ అంతా ఇంతా కాదు. భక్తులు జాతకాలు ఇట్టే చెప్పేస్తారట. కానీ వారి భవిష్యత్తు ఏమీటో తెలుసుకోవటానికి వచ్చినవారు ఈయన్ని ప్రసన్నం చేసుకోవాలి. అలా ఆయన్ని ప్రస్ననం చేసుకుంటేనే జాతకం చెబుతారు. అలా ఈ స్వామీజీని ప్రసన్నం చేసుకోవాలంటే ‘ఫుల్ బాటిల్’ మద్యం తాగేయాలి. అలా తాగితేనే వారి జాతకం చెబుతారట ఈ లిక్కర్ స్వామిజి.

ఈ స్వామిజీ దగ్గరకి వచ్చిన భక్తులు తమ భవిష్యత్తుని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడినుంచో వేలాదిగా తరలి వస్తారట. కానీ ఈ మణి స్వామిజి దగ్గరకి వచ్చేవారిలో పురుషులు ఎక్కువమంది ఉంటారు.వారి భవిష్యత్తు ఏంటి, ఆదాయం పెరగటానికి ఏం చేయాలో..ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుంటారట.

పురుషులు అధికసంఖ్యలో ఈ స్వామిజి ని ఆశ్రయించడానికి కారణం ఒక్కటే.. ఈ మణి స్వామిజి స్పెషల్ ఎవరైతే తమ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారో వారు ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగితేనే వారికీ స్వామిజి భవిష్యత్తు గురించి చెప్తారు. ఈ లిక్కర్ స్వామిజి గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడం తో స్వామిజి ఆశ్రయానికి జనాలు క్యూ కట్టి మరీ వస్తున్నారు. లిక్కర్ స్వామీజీని ప్రసన్నం చేసుకోవాలంటే ఫుల్ బాటిల్ తాగాలట అంటూ తమిళనాడు రాష్ట్రమంతి వైరల్ అయ్యింది.