Congress : టార్గెట్ 2024.. ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎంపవర్డ్ గ్రూప్
2024 ఎన్నికల కోసం ఎంపవర్డ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రూప్ లో ఎవరుంటారన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. వచ్చే నెల 13, 14 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ లో...

Soniya
Congress : 2024లో ఎన్నికలు.. ఇప్పటి నుంచే పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. వరుసగా కేంద్రంలో అధికారంలోకి వస్తున్న బీజేపీని గద్దెదింపడానికి ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగి.. అస్థిత్వం కోల్పోయి.. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వస్తుందా ? అనే చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం ఎదురైంది. ఈ క్రమంలో.. నేనున్నా అంటూ ప్రశాంత్ కిశోర్ వచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన చర్చలు జరిపారు. వరుసగా సోనియా, ఇతర సీనియర్ నేతలతో పీకే భేటీలు జరిపారు. సుదీర్ఘంగా భేటీలు జరిపిన అనంతరం ఆయన ఓ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన పార్టీలో చేరిన అనంతరం ఏ బాధ్యత అప్పచెప్పాలని కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతోంది. ఈ క్రమంలో.. సోనియా గాంధీ నివాసంలో 2022, ఏప్రిల్ 25వ తేదీ సోమవారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీకే చేరిక, 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అయితే.. ప్రశాంత్ కిశోర్ చేరికపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు నోరు విప్పడం లేదు.
Read More : congress: ఓడిపోయే పార్టీతో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుంది: మహేష్ గౌడ్
ఇక మీటింగ్ విషయానికి వస్తే… 2024 ఎన్నికల కోసం ఎంపవర్డ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రూప్ లో ఎవరుంటారన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. వచ్చే నెల 13, 14 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ లో నవ్ సంకల్ప చింతన్ శిబిర్ ఏర్పాటు చేయనుంది. సోనియా గాంధీతో జరిగిన కీలక సమావేశంలో పీకే చేరితే కలిగే లాభాలు, నష్టాలై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ కీలక సమావేశం జరిగింది. ఆయన చేరికపై ఇప్పటికే సోనియా గాంధీకి సీనియర్లు నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పీకే జరిపిన భేటీపైనా కూడా కాంగ్రెస్ హై కమాండ్ చర్చించింది. అయితే.. పార్టీలో పీకే చేరికకు రాహుల్, ప్రియాంక గాంధీలు అనుకూలగా ఉన్నా.. కొంతమంది సీనియర్ నేతలు మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. సీనియర్లు వెలిబుచ్చిన అనుమానాలపై సోనియా గాంధీ సుదీర్ఘంగా మేధోమథనం చేస్తున్నారు. ఎంపవర్డ్ గ్రూప్ లో ఎవరుంటారనేది సోనియా నిర్ణయిస్తారని, గ్రూప్ ఏర్పాటు కాకముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా వెల్లడించారు.