congress: ఓడిపోయే పార్టీతో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుంది: మహేష్ గౌడ్

టీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకోవడం కోసమే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్‌ను కలిశారని, ఓడిపోయే టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్.

congress: ఓడిపోయే పార్టీతో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుంది: మహేష్ గౌడ్

Mahesh Goud

congress: టీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకోవడం కోసమే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్‌ను కలిశారని, ఓడిపోయే టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. ‘‘తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. టీఆర్ఎస్ ఓటమి ఖాయం. టీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకునేందుకే ప్రశాంత్ కిషోర్, సీఎం కేసీఆర్‌ను కలిశారు. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం సృష్టించాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

telangana congress: ప్రశాంత్ కిషోర్ విషయం హైకమాండ్ చూసుకుంటుంది: భట్టి విక్రమార్క

ప్రశాంత్ కిషోర్ జాతీయ దృక్పథంతో కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. టీ.కాంగ్రెస్ గెలుపు కోసం కూడా ఆయన కృషి చేస్తారు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు. ఆ పార్టీవి పగటి కలలే’’ అని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. మరోవైపు వచ్చే నెల 6,7 తేదీల్లో జరిగే రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ ముఖ్య నేతలతా కృషి చేస్తున్నారని చెప్పారు. మే 6న వరంగల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని, 7న హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తారని వివరించారు.