Tech Mahindra : 125మిలియన్ డాలర్ల డీల్.. 2 అమెరికా సంస్థలను కొనేసిన భారత ఐటీ దిగ్గజం
ఇండియన్ ఐటీ దిగ్గజం అమెరికాకు చెందిన రెండు సంస్థలను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ అక్షరాల 125 మిలియన్ డాలర్లు.

Tech Mahindra
Tech Mahindra : ఇండియన్ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా అమెరికాకు చెందిన రెండు సంస్థలను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ అక్షరాల 125 మిలియన్ డాలర్లు. అమెరికాకు చెందిన గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్, అల్లీస్ గ్రూప్ ఇండియా సంస్థలను టెక్ మహీంద్రా పూర్తిగా కైవసం చేసుకుంది. వీటిలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ డీల్ మొత్తం విలువ 125 మిలియన్ డాలర్లు కాగా, ఈ మొత్తాన్ని పూర్తిగా నగదు రూపంలోనే చెల్లించనుంది టెక్ మహీంద్రా.
Covid Restrictions : స్కూళ్లు, కాలేజీలు, సెలూన్లు మూసివేత..
అమెరికాలోని సీయాటెల్ వేదికగా అల్లీస్ ఇండియా, గ్రీన్ ఇన్వెస్టమెంట్స్ పని చేస్తున్నాయి. సుమారు 660 మంది ఉద్యోగులు ఈ సంస్థల్లో పని చేస్తున్నారు. ఈ సంస్థల ఆదాయం 39.6 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంస్థల కొనుగోలుతో.. డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ సొల్యూషన్స్, లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, క్లౌడ్ అండ్ ఆటోమేషన్, బీఐ అండ్ అనలిటిక్స్, టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్స్ వంటి రంగాల్లో తమ కంపెనీ మరింత వృద్ధిని నమోదు చేస్తోందని టెక్ మహీంద్రా తెలిపింది.
WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం