Tejashwi Yadav Daughter Name : ముద్దుల మనుమరాలికి అందమైన పేరు పెట్టిన తాత లాలూ ప్రసాద్ యాదవ్

 బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ భార్య రాచెల్ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. చిన్నారి రాకతో లాలూ కుటుంబం అంతా సంతోషంలో మునిగితేలుతోంది. బిడ్డకు చక్కటి పేరు పెట్టాలని తాత లాలూ ప్రసాద్ యాదవ్ తెగ ఆనందపడిపోయారు. ముద్దుల మనుమరాలి కోసం ఓ చక్కటి పేరు కూడా సెలక్ట్ చేశారు. తన బిడ్డకు నా తండ్రి లాలూ పెట్టిన పేరును స్వయంగా తేజస్వి యాదవ్ వెల్లడించారు.

Tejashwi Yadav Daughter Name : ముద్దుల మనుమరాలికి అందమైన పేరు పెట్టిన తాత లాలూ ప్రసాద్ యాదవ్

tejashwi yadav Reveals New Born daughter name

Updated On : March 31, 2023 / 12:18 PM IST

Tejashwi Yadav Daughter Name : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తండ్రి అయిన తేజస్వి, ఆయన భార్య రాచెల్ గోడిన్హో తో పాటు ఆయన కుటుంబం అంతా సంతోషంలో మునిగితేలుతోంది. బిడ్డకు చక్కటి పేరు పెట్టాలని తాత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తెగ ఆనందపడిపోయారు. ముద్దుల మనుమరాలి కోసం ఓ చక్కటి పేరు కూడా సెలక్ట్ చేశారు. తన బిడ్డకు నా తండ్రి లాలూ పెట్టిన పేరును స్వయంగా తేజస్వి యాదవ్ వెల్లడించారు. చిన్నారికి ‘కాత్యాయని’ అనే పేరు పెట్టారని..ఈ పేరును నా తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా ఎంపిక చేశారని తేజస్వి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మరోవైపు మనవరాలు పుట్టిన వెంటనే లాలు, ఆయన భార్య రబ్రీదేవి ఆసుపత్రికి సంబరాల్లో మునిగిపోయారు. ముద్దుల మనుమరాలిని ఎత్తుకుని మా ఇంట్లో లక్ష్మీదేవి నడయాడబోతోందని చిన్నారిని ఎత్తుకుని మురిసిపోయారు. ముద్దుల మనుమరాలిని ముద్దులతో ముంచెత్తారు. వీరితో పాటు తేజస్వి అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ నేను పెదనాన్నను అయ్యారంటూ తెగ ఆనందపడిపోతున్నారు. ఇలా చిన్నారి రాకతో లాలూ కుటుంబం అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ ఆనందాన్ని మిఠాయిలు పంచి సెలబ్రేట్ చేసుకున్నారు. బీహార్ విధానసభ ప్రాంగణంలో ఆయన మిఠాయిలు పంచిపెట్టారు.

కూతురు పుట్టిన ఆనందంలో తేజస్వీ యాద్ భార్యను బిడ్డను అపురూపంగా చూసుకుంటున్నారు. అలాగే మనుమరాలిని ఎత్తుకుని లాలూ, రబ్రీలు మురిపిసోతున్న ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా తేజస్వి నా చిట్టితల్లి నా కుటుంబంలో మరింత సంతోషాన్ని కలుగజేస్తుందని మా ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని తెలిపారు. కాత్యాయని అంటే మహిషారుడ్ని వధించిన దుర్గాదేవత అంశం. హిందూ పురాణాల్లో ఆదిశక్తి అంశలతో పలు అవతారాలున్నాయి. దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో కాత్యాయని ఆరవ రూపం.