కేరళ సీఎంతో సమావేశమైన కేసీఆర్

కేరళ సీఎం పిన్నరయి విజయన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.కేరళ రాజధాని తిరువనంతపురంలోని క్లిఫ్ హౌస్ లో విజయన్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో ఇద్దరు సీఎంలు చర్చించారు. లోక్ సభ ఎన్నికలు, ఫలితాలు, దేశ రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. అంతకుముందు తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.