కుట్ర ఎక్కడ : దేశంపై మళ్లీ దాడులు జరుగుతాయా

కుట్ర ఎక్కడ : దేశంపై మళ్లీ దాడులు జరుగుతాయా

Updated On : March 5, 2019 / 10:04 AM IST

భారత్ పై మరోసారి పాక్ దాడులు జరపనుందా.. అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. స్వయంగా భారత నేవీ చీఫ్ సునీల్ లంబా భారత్‌పై ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్రలు జరుగుతున్నాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. దేశాన్ని అస్థిరపరిచే విధంగా దాడులు జరిపేందుకు పాక్ ఉగ్రవాదంతో పావులు కదుపుతోందని ఆయన వెల్లడించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల మార్గాల్లో కాకుండా ఈ సారి సముద్ర మార్గాల గుండా దాడులు చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. 
Also Read : గురి చూసి కొట్టారు : పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్

వారు దాడులు చేసేందుకు వేసిన ప్లాన్ గురించి మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. పాకిస్తాన్ పేరు చెప్పుకుండానే ఈ సంగతి గుర్తు చేశారు. 3వారాల క్రితం పుల్వామా ఘటన చాలా దారుణమైందని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రూపులు ఉగ్రవాదానికి పాల్పడుతుండటం చూస్తూనే ఉన్నాం. భవిష్యత్ లో కూడా ఇలాగే వ్యవహరిస్తే చాలా బాధ అనుభవించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. 

26/11 అటాక్‌లో లష్కర్ యే తొయిబాకు చెందిన 10మంది ఉగ్రవాదులు సముద్ర రవాణా నుంచే భారత్ లోకి అడుగుపెట్టినట్లు గుర్తు చేశారు. భారత్‌కు చెందిన చేపలు పట్టే నౌకను కబ్జా చేసి భారత్ లోకి చొరబడ్డారని వెల్లడించారు. వీటినన్నిటినీ బట్టి చూస్తే.. శాంతిని నెలకొల్పేందుకు ముందడుగు వేశామని పాక్ చెప్పిందంతా నిజం కాదా అనే ప్రశ్న సగటు భారతీయుడిలో తలెత్తుతోంది.  
Also Read : ఇది కొంచెం ఢిఫరెంట్… బీర్ బాత్ టబ్ ఛాలెంజ్ చూశారా?