ఒకప్పుడు ఉగ్రవాది : ఇప్పుడు అశోకచక్ర అవార్డ్
ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు భారత ఆర్మీలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అతనే లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వాని.

ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు భారత ఆర్మీలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అతనే లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వాని.
ఇండియన్ ఆర్మీ జవాన్ గా మారిన ఉగ్రవాది
టెర్రరిస్ట్ ల చేతిలో హతం
ప్రతిష్టాతమ్మక అశోక్ చక్ర అవార్డు ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ : మనిషి మార్పు సహజం. కాలం మనిషిలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. మంచీచెడుల మేలు కలయిగా ఆయా పరిస్థితులను బట్టి మనిషిలో నడవడికలో పలు మార్పులు జరుగుతుంటాయి. పుట్టుకతోనే ఎవరు దొంగలుగా..ఉగ్రవాదులు..దుర్మార్గులుగా పుట్టరు. పుట్టిన పెరిగిన పరిస్థితుల రీత్యా..సమాజం మనిషిని మార్చివేస్తుంటుంది. ఈ క్రమంలో ఒకప్పుడు నరరూప రాక్షసుడిగా ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు భారత ఆర్మీలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అతనే లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వాని.
అహ్మద్ వాని అశోక్ చక్ర అవార్డ్
ఉగ్రవాద సంస్థలో పనిచేసిన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వాని కొంతకాలానికి మనిషిగా మారి ఆర్మీలో చేరి ఎంతో సేవ చేశాడు. దేశానికే తలమానికంగా నిలిచాడు. దేశ సేవలోనే దేశానికి ముప్పు తెచ్చే ఉగ్రవాదులతో పోరాడుతూనే అమరుడయ్యాడు. దేశం కోసం అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆ జవాన్‌కు ఆర్మీలోని అత్యున్నత పురస్కారం అశోక చక్రను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019 జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వాని కుటుంబం అశోక చక్ర అవార్డును అందుకోనుంది.
టెర్రరిస్ట్ ల ఘాతుకానికి బలైన అహ్మద్ వాని
దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో ఉగ్రవాదులు చొరబడేందుకు యత్నించగా..వారితో భారత ఆర్మీ జరిపిన పోరాటంలో అహ్మద్ వాని తన ప్రాణాలనే అర్పించాడు. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులను సైతం జవాన్లు మట్టుపెట్టారు. ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలర్పించిన అహ్మద్ వానికి మరణానంతరం ఈ ఏడాది అశోక్ చక్ర అవార్డును ప్రదానం చేయనున్నారు. గాయాలపాలైన తోటి జవాన్లను కాపాడేందుకు ఇద్దరు టెర్రరిస్టులను లాన్స్ నాయక్ కాల్చి చంపారు. ఎన్‌కౌంటర్‌లో వాని అమరుడైన తర్వాత అతడి తండ్రిని ఓదార్చడం తోటి జవాన్ల వల్ల కాలేదు. కాగా, లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్‌కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా తోటి జవాన్లను కాపాడటంతో పాటు, ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గానూ అశోకచక్ర అందిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.
ఇండియన్ ఆర్మీ జవాన్ గా మారిన ఉగ్రవాది అహ్మద్ వాని
వాస్తవానికి నజీర్ అహ్మద్ ఓ ఉగ్రవాది. 1990 దశకంలో ఉగ్రకార్యకలాపాలు నిర్వహించిన అతడు 2000 ఏడాది తర్వాత మారిపోయాడు. కొన్ని కారణాలతో ఆర్మీ ముందు లొంగిపోయిన నజీర్ అహ్మద్ 162వ బెటాలియన్‌లో 2004లో చేరాడు. కౌంటర్ ఇన్‌సర్జెన్సీ ఆపరేషన్స్‌లో పాల్గొన్నాడు. ఉగ్రవాద నిర్మూలనతో తన వంతుగా పోరాటం చేశాడు. కుల్గామ్‌కు చెందిన అతడు సేనా మెడల్‌ను రెండుసార్లు నెగ్గాడు. చివరగా 2018 నవంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.