అమిత్ ‌షాకు కరోనా పాజిటివ్

  • Published By: venkaiahnaidu ,Published On : August 2, 2020 / 05:19 PM IST
అమిత్ ‌షాకు కరోనా పాజిటివ్

Updated On : August 2, 2020 / 5:42 PM IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్‌లో తెలిపారు.

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, కానీ వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నా అని అయన తెలిపారు గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని అమిత్ షా సూచించారు.


బాల గంగాధర తిలక్ 100వ వర్థంతి సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన వెబినార్ ప్రారంభ సమావేశంలో అమిత్ షా శనివారం పాల్గొన్నారు. దీంతో.. ఆ సమావేశంలో పాల్గొన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.